బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. అప్పటి దాకా స్నేహంగా మెలిగిన వారు అప్పుడే గొడవలు పడుతారు. ఇంకా విషయానికి వస్తే ఈ వారం కెప్టెన్ అవ్వడానికి ఇచ్చిన టాస్క్ లో కష్టపడి కష్టపడి శ్రీముఖి కెప్టెన్ అయ్యింది. ఎన్నో వారాల కళను ఈ వారం ఇంటి సభ్యుల సహాయంతో నెరవేర్చుకుంది.                            


అయితే బిగ్ బాస్ హౌస్ లో రెండు రోజుల నుంచి చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. మొన్నటి వారు గ్యాంగ్ గా ఉండి అందరిని ఏడిపించిన వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్. ఇప్పుడు వారే రెండు గ్రూపులుగా డివైడ్ అయ్యారు. ఇంకేముంది ఒకరిని ఒకరు వెనుక బాగానే తిట్టుకుంటున్నారు.                                 


ఈ విషయంపై మరికొందరు ఇంటి సభ్యులు మాట్లాడుకుంటూ.. వారు గ్యాంగ్ గా ఉంటె అందరూ ఫైనల్ వరుకు ఇంట్లో ఉంటారు. విడిపోతే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ గేమ్ ఇప్పుడే మొదలైయ్యింది అని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన అలీ రెజా చెప్తున్నాడు.                             


మరి ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ అవుతే ఇన్నాళ్లు ఎం గేమ్ జరిగింది ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ గేమ్ ఇప్పుడే ఇంట్రెస్టింగా ఉంది అని అంటున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: