దేవీ శ్రీ ప్రసాద్ మెగాస్టార్ కి శంకర్ దాదా ఎం.ఎం.బి.ఎస్ సినిమాకి ఒక రేంజ్ లో మ్యూజిక్ ని అందించాడు. మెగాస్టార్ తో అద్భుతంగా స్టెప్స్ వేసేలా మాంచి హుషారైన ట్యూన్స్ ఇచ్చి చిరు మనసులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక చిరు రీ-ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 కి కూడా మాంచి మాస్ సాంగ్స్ ఇచ్చి ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోస్ కి ఏమాత్రం తగ్గకుండా చిరు డాన్స్ తో అదరగొట్టారు. అయితే ఈ మధ్య దేవీ హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. అందుకు కారణం గత కొంతకాలంగా రిపీటెడ్ ట్యూన్స్ ఇస్తున్నాడని కంప్లైంట్ రావడమే. దాంతో కొంతమంది దర్శకులు దేవీ ని దూరం పెట్టారు. 

ఇక కొరటాల శివ కి దేవీ శ్రీ ప్రసాద్ కి మంచి ట్యూనింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వచ్చి మ్యూజికల్ గా మంచి హిట్ ని అందుకున్నాయి. అంతేకాదు ఈ సినిమాలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అంద్భుతంగా ఇచ్చాడు దేవీ. అయితే ప్రస్తుతం మెగాస్టార్ తో కొరటాల తెరకెక్కించబోతున్న చిరు 152 వ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్న డైలమాలో ఉన్నారు. కొరటాల ఎప్పటిలాగే దేవీ ని తీసుకుంటాడా లేక మార్చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

వాస్తవంగా సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా కొరటాల-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తున్న సినిమా కోసం రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ను కాకుండా బాలీవుడ్‌ నుంచి సంగీత దర్శకులను తీసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా మొన్నటి వరకే.. ఇప్పుడు అలాంటిదేం లేదు. ఆ వార్తలన్నీ పుకార్లేనని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ అమిత్ త్రివేదిని వద్దనుకొని మళ్లీ దేవీ శ్రీ కే కొరటాల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని లేటెస్ట్ న్యూస్. ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని స్వయంగా దేవీ శ్రీ కి ఫోన్ చేసిన కొరటాల.. సినిమా కోసం సిద్ధమవమని  చెప్పినట్టు తెలుస్తోంది. ..'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా.. మ్యూజిక్ పరంగా మంచి టాక్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూడు సినిమాలు బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తోనే నడిచేశాయి. అందుకే చిరు సినిమాకు మళ్లీ ఆయన్నే తీసుకోవాలని కొరటాల ఫిక్స్ అయ్యారట.



మరింత సమాచారం తెలుసుకోండి: