బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. మొన్నటిదాకా హౌజ్ లో ఉన్న వరుణ్, రాహుల్ ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటూ మంచి రిలేషన్ మెయింటైన్ చేయగా రీసెంట్ గా జరిగిన ఓ టాస్క్ లో ఇద్దరు గొడవపడటం జరిగింది. ఇన్ని వారాల్లో రాహుల్ సీరియస్ గా ఆడిన టాస్క్ ఇదే అని చెప్పొచ్చు. అయితే దీని వల్ల వరుణ్, రాహుల్ ల మధ్య రిలేషన్ పాడయింది.


ఇదిలాఉంటే హౌజ్ లోకి అలి రెజా మళ్లీ రీ ఎంట్రీ అందరికి షాక్ ఇచ్చింది. అయితే కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రవి, బాబా భాస్కర్, శ్రీముఖి, శివ జ్యోతిలకు బౌల్ లో కలర్ ఇచ్చి ఆ కలర్ ను కాపాడుకోవాలని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా ఎలాంటి గొడవలు లేకుండా ఆడగా ఫైనల్ ఆ శ్రీముఖి ఇంటి కెప్టెన్ అయ్యింది.


10వ వారం కెప్టెన్ గా శ్రీముఖి టాస్క్ లో గెలిచింది. అయితే ఈ టాస్క్ వల్ల మళ్లీ హౌజ్ లో 3 బ్యాచ్ లు తయారవడం విశేషం. వితిక వల్లే కెప్టెన్సీ వచ్చిందని శ్రీముఖి వితిక, వరుణ్ లతో పాటుగా బాబా భాస్కర్ లకు దగ్గగరైంది. ఇక మరో పక్క అలి రెజా, రవి కృష్ణ, శివ జ్యోతి, మహేష్ ఒక టీం గా ఏర్పడ్డారు. 


మిగిలిన రాహుల్, పునర్నవి ఎవరితో సంబంధం లేదు అన్నట్టుగా ఇద్దరే జంటగా ఉంటున్నారు. శుక్రవారం ఆట ముగిసింది. మరి శనివారం వచ్చిందంటే ఎలిమినేషన్ మొదలైనట్టే. ఇంతకీ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..? వరుణ్ సందేష్, శ్రీముఖి, రవి కృష్ణ, బాబా భాస్కర్ నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ వారం ఎలిమినేషన్ ఎవరవుతారన్నది తెలియాల్సి ఉంది. బాబా భాస్కర్, రవి లలో ఒకరు ఇంటి నుండి బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: