సైరా మూవీ మరో నాలుగు రోజుల్లో థియేటర్లో సందడి చేయనుంది. ఈ సినిమా చారిత్రాత్మకం చిరంజీవి జీవితంలో చేస్తున్న తొలి జోనర్ ఇది. ఇప్పటివరకూ చిరంజీవి అంటే ఫైట్లు, డ్యాన్సులు మాత్రమే చూసిన జనానికి ఆయన నటన చూసే అవకాశం ఈ మూవీలో లభిస్తుంది. ఇక ఇపుడున్న కాలం పరిస్థితులు తీసుకుంటే ఈ తరహా మూవీలకు కాసులు కురుస్తాయా అన్నది ఓ పెద్ద సందేహం.


జనాలను సినిమా హాళ్ళకు రప్పించే కమర్షియల్ ఎలిమెంట్ సైరాలో ఏముంది అని ఆలోచిస్తే కొంత సందేహం కలుగుతుంది. ఈ మూవీది డ్రై సబ్జెక్ట్. 174 ఏళ్ళ క్రితం జరిగిన కధ. కధాపరంగా చూస్తే చాలా చిన్నది కూడా. ఉయ్యాలవాడ నరసిం హారెడ్డికి సంబంధించి  చెప్పాలంటే పెద్దగా ఏదీ లేదు ఇక దానికి కల్పన జోడిస్తే అది పక్కా మెగాస్టార్ మూవీ అవుతుంది తప్ప చరిత్ర చెప్పినట్లు ఉండదు.


ఇక చిరంజీవిని ఈ పాత్రలో అటు జనాలు కానీ ఇటు ఫ్యాన్స్ కానీ ఎంతవరకు రిసీవ్ చేస్తుంటారన్నది కూడా మరో డౌట్. చిరంజీవి వయసు ఒకటి మైనస్ అయితే ఆయన వాయిస్ మరో మైనస్ గా చెబుతున్నారు. పవర్ ఫుల్ డైలాగులు చెప్పినపుడు ఆ గొంతులో ఖంగుమనిపించడంలేదని టీజర్ టాక్ చెబుతోంది. ఇక మూవీలో ఏమైనా టెక్నాలజీ యూజ్ చేస్తే చూడాలి మరి


ఇక చిరంజీవి ప్రయోగాలు ఎపుడు చేసినా ఫలితాలు తేడా కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన మక్కువ మీద తీసిన రుద్రవీణ మూవీ నటనాపరంగా బాగానే  మార్కులు పడ్డాయి కానీ సినిమా ఫెయిల్ అయింది. అలాగే ఆపద్భాంధవుడు కధ కూడా అంతే. అవార్డ్ వచ్చింది కానీ మూవీ ఆడలేదు. ఇన్నేళ్ల తరువాత చిరంజీవి తనది కానీ కొత్త జోనర్లోకి వెళ్తున్నారు. మరి జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: