మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాపై ఇప్పటికే రోజు రోజుకు అంచనాలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ మొదటిసారి ఒక స్వతంత్ర సమరయోధుడి పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను దాదాపుగా రూ.250 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారు నిర్మాత రామ్ చరణ్. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రెండు ట్రైలర్స్ సినిమాపై మంచి అంచనాలు పెంచడంతో సైరా టీమ్ మాత్రం ప్రేక్షకుల అంచనాలు తప్పకుండా అందుకుని తీరుతాం అని అంటోంది. పాన్ ఇండియా ఫీల్ తో తెలుగుతో పాటు మరొక నాలుగు భాషల్లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై చాలావరకు పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నప్పటికీ, 

ఈ సినిమా యూనిట్ ఒక్క విషయం లో కొంత ఆందోళనగా ఉందట. అదేమిటంటే, గతంలో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పరంగా విజయవంతమైన సినిమాల్లో ఎక్కువగా నటించినవి మాస్ మరియు కమర్షియల్ సినిమాలేనని, అటువంటి సినిమాలతో టాలీవుడ్ లో తిరుగులేని రారాజుగా ఎదిగిన మెగాస్టార్, తన కెరీర్లో చేసిన ప్రయోగాల్లో చాలావరకు విఫలయమైన విషయమై కొంత అనుమానపడుతున్నారట. చిరంజీవి తన సినిమాలను కమర్షియాలిటీకి భిన్నంగా ట్రై చేసిన ప్రతిసారీ ఆయనకు ఫ్లాప్ ఎదురైంది. ఆపద్భాందవుడు, స్నేహం కోసం, బిగ్ బాస్, రుద్రవీణ వంటి సినిమాలు చిరుకు ఓ నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం వాటికి నిరాశ తప్పలేదు.  

అయితే అవి మాత్రమే కాక చెప్పుకుంటూ పోతే, ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయని, ఆ విధంగా చూస్తే ఇప్పుడు స్వాతంత్రోద్యమ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కూడా చిరు ఎంచుకునే కమర్షియల్ సినిమాలకు భిన్నంగా వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా ఫలితం తేడా కొడుతుందేమో అని లోలోపల కొంత భయపడుతున్నట్లు సమాచారం. అయితే అవన్నీ ఒట్టి పుకార్లే అని, సినిమాలో మంచి కథ, కథనాలు ఉంటె అటువంటివి ప్రయోగాలా, లేక కమర్షియల్ సినిమాలా అనేవి ప్రేక్షకులు చూడరని, కాబట్టి సైరా టీమ్ ఆందోళన చెందుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తాము భావిస్తున్నట్లు చెప్తున్నారు కొందరు సినీ విశ్లేషకులు........!!


మరింత సమాచారం తెలుసుకోండి: