‘సైరా’ విడుదలకు ఇక నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈరోజు నుండి ఈ మూవీ ప్రమోషన్ తారా స్థాయికి చేరబోతోంది. ఈ వారాంతంలో అన్ని ప్రముఖ పత్రికలు అలాగే అన్ని ప్రముఖ ఛానల్స్ ‘సైరా’ కు సంబంధించిన వార్తలను ప్రముఖంగా ప్రసారం చేస్తూ చిరంజీవి తో చేసిన ఇంటర్వ్యూలను ప్రసారం చేయబోతున్నాయి.

ముఖ్యంగా ఈ మూవీలో కీలక పాత్రను పోషించిన అమితాబ్ చిరంజీవిలు కలిసి ఒక టేబుల్ దగ్గర లంచ్ చేస్తూ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నట్లుగా తీసిన ఇంటర్వ్యూ వీడియో ఈ మూవీ ప్రమోషన్ కు హైలెట్ అవుతుంది అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా సెన్సార్ కార్యక్రమాలు తరువాత ఇప్పటికే ఈ మూవీని చూసిన కొందరు ఈ మూవీ క్లైమాక్స్ గురించి కొన్ని లీకులు ఇస్తున్నారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యధాతథంగా తీశారట. ముఖ్యంగా నరసింహారెడ్డికి ఉరి శిక్ష వేయడం ఆ తరువాత ఆయన తలను కోవెలకుంట్ల కోట గుమ్మానికి వేలాడతీయడం లాంటి సన్నివేశాలు యధాతధంగా తీసినప్పటికీ చిరంజీవి తలను కోటకు వెళ్లాడ తీసే సన్నివేశాన్ని స్పష్టంగా కనిపించకుండా కొద్దిగా మసకగా తీసినట్లు తెలుస్తోంది. ఈ విషాదాంతాన్ని మెగా అభిమానులు ఎంత వరకు ఒప్పుకుంటారు అన్న భయంతో ఈ చిన్న మార్పు చేసినట్లు తెలుస్తోంది.  

ఈ క్రమంలో చిరంజీవి లేకుండానే దాదాపు 15 నిమిషాల వరకు ‘సైరా’ క్లైమాక్స్ కొనసాగనుందట. అంతేకాదు నరసింహారెడ్డి వీర మరణం తరువాత వచ్చే సన్నివేశాల్లో పవన్ కల్యాణ్ తన వాయిస్‌ తో ఎంట్రీ ఇవ్వడంతో పాటు కనీసం 10 నిముషాల పాటు పవన్ చెపుతున్న వాయస్ ఓవర్ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన ఫోటోలు అదేవిధంగా దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ముఖ్య నాయకులు విప్లవ యోధుల ఫోటోలు స్క్రీన్ పై కనపడుతూ ఉంటే ఒక డాక్యుమెంటరీలా పవన్ వాయస్ ఓవర్ కొనసాగి చివరకు జనగణమన గొప్పతనం గురించి పవన్ చెప్పే ఉద్వేగ పూరితమైన మాటలతో ‘సైరా’ పూర్తి అవుతుందని సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి: