‘సైరా’ విడుదల అయిన తరువాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం వహించే మూవీ షూటింగ్ లో నవంబర్ నుండి పాల్గొనబోతున్నారు. ఈ మూవీ నిర్మాణం ఇప్పటికే రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన పరిస్థితులలో ఈ మూవీని ఆరు నెలల్లో పూర్తి చేయాలని కొరటాల పట్టుదల పై ఉన్నారు. 

ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ హీరోయిన్ ఎంపిక విషయంలో కొరటాల తీసుకున్న నిర్ణయం మెగా అభిమానులకు ఊహించని షాక్ గా మారింది. వాస్తవానికి ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార అనుష్క శ్రుతిహాసన్ ల పేర్లు వినిపించాయి. అయితే అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ కొరటాల చిరంజీవి పక్కన హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి త్రిష జూనియర్ ఎన్టీఆర్ తో 2012లో విడుదలైన ‘దమ్ము’ సినిమా తరువాత మరి ఏ సినిమాను టాప్ హీరోలతో చేయలేదు. ఈమెకు తెలుగు ప్రేక్షకులలో పూర్తిగా క్రేజ్ తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితులలో త్రిషను హీరోయిన్ గా ఎందుకు కొరటాల ఎంపిక చేసాడు అంటూ మెగా అభిమానులు మండిపడుతున్నట్లు టాక్. 

గతంలో త్రిష చిరంజీవితో ‘స్టాలిన్’ మూవీలో నటించినా ఆమూవీ హిట్ కాలేదు. అదేవిధంగా ఆమె పవన్ కళ్యాణ్ తో నటించిన సినిమా కూడ ఫ్లాప్ అయింది. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి పక్కన ఈ ఫ్లాప్ హీరోయిన్ ఏమిటి అంటూ మెగా అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ మూవీ లో హీరోయిన్ పాత్రకు బాగా నటించగల సామర్ధ్యం ఉన్న నటితో పాటు బల్క్ డేట్స్ ఇవ్వగల హీరోయిన్ గురించి కొరటాల ఆలోచనలు చేస్తున్న పరిస్థితులలో  కొరటాల ఈ ఎంపిక చేసాడు అని అంటున్నారు.   అయితే మెగా అభిమానుల అసహనాన్ని దృష్టిలో పెట్టుకుని కొరటాల హీరోయిన్  విషయంలో మార్పులు చేస్తాడా లేదా అన్నది ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: