విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నరు. అన్ని రకాల మూవీస్  ని వెంకీ చేసినా కూడా ఆయనకు లేడీ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. వెంకటేష్ కెరీర్లో ఎక్కువ సినిమాలు కూడా ఇవే కావడం, అవి కూడా హిట్లు కొట్టడంతో వెంకీ ఏ కొత్త మూవీ ప్లాన్ చేసినా లేడీస్ ని ద్రుష్టిలో పెట్టుకుని డిజైన్ చేసుకుంటాడు. వెంకీది పక్కా ప్లానింగ్ అని కూడా అందరూ అంటారు.


చిత్రమేంటంటే టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎక్కువ హిట్లు, సక్సెస్ రేటింగ్ ఉన్న హీరో వెంకీ మాత్రమే. అటువంటి వెంకీ మళ్ళీ ఫాంలోకి వచ్చేశాడు. ఎఫ్ 2 హిట్ తో వెంకీ జోనర్ ఏంటన్నది తెలిసిపోయింది.  ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తన సినిమా హిట్ చేసుకోవడం వెంకీ స్పెషాలిటీ. ఇపుడు అదే రూట్లో వెంకీ మామ మూవీ సొంత మేనల్లుడు నాగ చైతన్యతో కలసి  వెంకీ చేస్తున్నాడు.


ఈ మూవీ కంప్లీట్ అవుతోంది. తరువాత వెంకీ మూవీ ఏంటి అన్న చర్చ వస్తోంది. వెంకీ చేతిలో నాలుగైదు మూవీస్ ఉన్నాయి. ఇందులో ఏది స్టార్ట్ చేయాలన్నది ఇపుడు పెద్ద ఆలోచనగా ఉంది. అన్నిటికీ మించి దే దే  ప్యార్ దే మూవీ రీమేక్ చేయాలా వద్దా అన్న డౌట్ వెంకీని పట్టి పీడిస్తోందట. ఈ మూవీ బాలీవుడ్ లో పెద్ద హిట్ కావడంతో దాని రైట్స్ సురేష్ బాబు తీసుకున్నారు.


ఈ మూవీని వెంకీతో తీయాలని కూడా డిసైడ్ అయ్యారు. వెంకీ అయితేనే యాప్ట్ అని కూడా అనుకున్నారు. అయితే ఇపుడు వెంకీ ఆ ప్రాజెక్ట్ మీద అంత ఇంటెరెస్ట్ చూపించడంలేదని టాక్. ఎందుకంటే నాగార్జున దీనికి కారణం అంటున్నారు. ఆయన రీసెంట్ గా చేసిన మన్మధుడు 2 మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. వయసు మళ్ళిన హీరో పడుచు అమ్మాయి ప్రేమలో పడడాన్ని జనం యాక్సెప్ట్ చేయలేకపోయారు.


దాదాపుగా అదే కధగా ఉంటుంది దే దే ప్యార్ దే మూవీ. ఈ మూవీలో కూడా హీరో వయసు మళ్ళినవాడు. ఆయన సైతం కుర్ర భామతో ప్రేమాయణం నడుపుతాడు. దాంట్లోంచి వచ్చే ఫన్నీ, రొమాంటిక్  సీన్స్ బాలీవుడ్ లో ఆ మూవీని నిలబెట్టాయి. ఇపుడు మన్మధుడు 2 ఫలితం తెలిసిన తరువాత వెంకీ ఈ మూవీ చేయడానికి వెనకంజ వేస్తున్నాడుట. తాను కూడా కుర్ర భామలతో రొమాన్స్ చేస్తే జనం చూస్తారో చూడరో అన్న డౌట్లు వ్యక్తం చేస్తున్నాడని టాక్. మొత్తానికి మన్మధుడు 2 వెంకీ డ్రీం ప్రాజెక్ట్ కి చెక్ పెట్టేలా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: