బిగ్ బాస్ గేమ్ షో ఏదైనా జరగొచ్చు. ఎప్పుడు ఎవరు ఏ రకంగా ప్రవర్తిస్తారనేది ఎవ్వరికీ తెలియదు. ఈ రోజు గొడవ పెట్టుకుని మళ్లీ రేపు కలిసిపోయే వారినెందరినో చుశాం. కానీ ఇద్దరు ప్రాణ మిత్రులమని చెప్పి, అలా చెప్పిన రెండు రోజుల్లోనే గొడవకి దిగడం ఈ సీజన్ లోనే జరిగిందేమో! అయితే ఆ గొడవ జరిగిన దగ్గరి నుండి బిగ్ బాస్ హౌస్ పూర్తిగా మారిపోయింది. బిగ్ బాస్ లో రాహుల్,వరుణ్ ల మధ్య జరిగిన గొడవలో ఇద్దరిదీ తప్పుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.


అయితే ఎవరికి వారు తాము చేసింది కరెక్ట్ అని భావిస్తున్నారు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ విషయంలో రాహుల్ ఎక్కువ ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. వరుణ్ తో గొడవ జరిగినపుడు రాహుల్ ని నువ్వెలాంటి వాడివో, నీ ఆటిట్యూడ్ ఏంటో మొత్తం తెలుసు అంటాడు. ఈ మాటలే రాహుల్ ని ఎక్కువగా బాధించాయి. అంతా తెలిసినపుడు కూడా అంత బాగా స్నేహం చేశావంటే, నువ్వు చేసిందంతా నటనే కదా అని రాహు్ల్ అభిప్రాయ పడుతున్నాడు.


అయితే వరుణ్ ఏదైతే తప్పు చేశాడని భావిస్తున్నాడో అదే తప్పుని రాహుల్ వితికా విషయంలో చేశాడు. రీ ఎంట్రీ ఇచ్చిన ఆలీ తో ఈ విషయం మాట్లాడుతూ, వితికా అలాంటిది, ఇలాంటిది అంటూ మాట్లాడతాడు. పునర్నవి తో కూడా ఈ విషయాన్ని డిస్కస్ చేశాడు. వితికా మీద రాహుల్ కి మొదటి నుండి అలాంటి అభిప్రాయం ఉన్నా కూడా ఆమెతో స్నేహంగా ఉన్నాడంటే రాహుల్ కూడా నటించినట్టే కదా అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.


వరుణ్ ఏదైతే తప్పు చేశాడని రాహుల్ భావిస్తున్నాడో వితికా విషయంలో కుడా రాహుల్ అదే చేశాడనే వార్తలు వస్తున్నాయి. మరి వీరిద్దరి మధ్య గొడవలు తగ్గి ఇప్పట్లో సద్దుమణుగుతుందా లేదా తెలియటంలేదు. నాగార్జున గారు కల్పించుకున్నా కూడా వీరిద్దరూ మళ్లీ మునుపటిలా ఉండటం అసాధ్యం అనిపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: