టాలీవుడ్ హాస్యనటుల్లో ఒకరైన ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ నాలుగు రోజుల క్రితం లివర్ మరియు కిడ్నీ సంబంధిత వ్యాధితో సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందిన విషయం తెలిసిందే ఆయన మృతితో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. వేణుమాధవ్ ఎంతో గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తిని, తెరమీద కామెడీ చేసి అందర్నీ నవ్వించే వేణుమాధవ్ బయట మాత్రం పరులకు ఎంతో సాయం చేసే గొప్ప మనసు ఉన్న వ్యక్తిని పలువురు సినిమా రంగ ప్రముఖులు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చెప్పడం జరిగింది. 

ఇకపోతే మెగా బ్రదర్ నాగబాబు నేడు తన అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా హాస్య నటుడు వేణుమాధవ్ గురించి మరియు అతడితో కలిసి పనిచేసిన ఒకప్పటి రోజులు గురించి గుర్తు చేసుకుంటూ మాట్లాడారు. స్వతహాగా వేణుమాధవ్ కామెడీ సినిమాల్లో ఎంతో అద్భుతంగా ఉంటుందని, అయితే బయట అతడిని కలిసి, అతడు మనతో మాట్లాడే విధానం వ్యవహరించే పద్దతి అంతకు మించి ఎంతో సరదాగా ఉంటుందని, ఇక అతడి ప్రవర్తన తీరు చాలా గొప్పదని, ప్రక్కవారికి తన వంతుగా సహాయం చేయాలని ఎప్పుడూ వేణుమాధవ్ అంటూ ఉంటాడని నాగబాబు సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు. 

తనతో కలిసి ఒక సినిమా కోసం దాదాపుగా 41 రోజుల పాటు కలిసి పనిచేశానని, ఆ సినిమా అనుభవాలు ఇప్పటికీ మర్చిపోలేనని, ఎప్పుడూ తనను అన్నా, అన్నా అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తాడు అని నాగబాబు అన్నారు. ఎంత గొప్ప వ్యక్తులకైనా ఏవో కొన్ని అలవాట్లు ఉంటాయని, ఆ విధంగానే వేణుమాధవ్ కూడా ఒక వ్యసనానికి బానిస అవటం వల్ల తన ఆరోగ్యం పూర్తిగా పాడయిందని, దాని వల్లనే అతడు చివరికి మరణించాడని నాగబాబు అన్నారు. ఇక తన మదిలో ఎప్పుడూ నవ్వుతూ ఉండే వేణుమాధవ్ తీపి గుర్తులు ఉన్నాయని, అవి చెరిగిపోకూడదనే కడసారిగా అతడి పార్థివదేహాన్ని చూడటానికి కూడా తాను వెళ్లలేదని నాగబాబు చెప్పారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: