మెగాస్టార్ చిరంజీవి నటించిన "సైరా" మరి కొద్దొ రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తొలి స్వాంతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథతో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లకి మంచి స్పందన వస్తుంది.  తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాల భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది.


ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా ఉంది. చిరంజీవితో సహా చిత్ర యూనిట్ అంతా ముంబయికి చేరుకున్నారు. మొదటి నుండి హిందీలో భారీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే టీజర్ ని ముంబయిలో విడుదల చేశారు. ఈ రోజు నుండి ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొననున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొననున్నారట. అయితే ఈ సినిమా హిందీలో విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.


అయితే ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులని బద్దలు కొడుతుందా అనే సందేహం కలుగుతుంది. సినిమా బాగుంటే బాహుబలి రికార్డులని కూడా కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు. చిరంజీవి మొదటిసారిగా స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించడమే కాకుండా, ఎమోషనల్ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాలో చాలా ఉన్నాయి. అందువల్ల ఉత్తరాది జనాలు సినిమాని బాగా ఆదరిస్తారని అంటున్నారు.


అయితే సాహో సినిమా కూడా ఉత్తరాదిన బాగానే ఆడినప్పటికీ, తెలుగులో నాన్ బాహుబలి రికార్డ్ సాధించిన రంగస్థలాన్ని కూడా దాటలేకపోయింది. ఓవరాల్ గా రంగస్థలాన్ని దాటిపోయినప్పటికీ, తెలుగు వరకు చూసుకుంటే రంగస్థలం వెనకే ఉంది. మరి సైరా నైనా ఈ ఫీత్ సాధిస్తుందా లేదా చుడాలి. కంటెంట్ బాగుంటే మాత్రం బాహుబలి రికార్డులను కూడా తిరగరాస్తుందని అనుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: