టాలీవుడ్ లో దశాబ్దాలుగా నెంబర్ వన్ గా ఉంటున్న చిరంజీవి ఆ పొజిషన్ ను వదిలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సినిమాలకు విరుద్ధంగా రాజకీయాల్లో ఆయన ప్రస్థానం కొనసాగింది. దానిపై ఇటివల ఓ తమిళ పత్రిక వికటన్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. తన రాజకీయ ప్రస్థానంపైనే కాకుండా రజనీకాంత్, కమల్ హాసన్ ల పొలిటికల్ ఎంట్రీపై వ్యాఖ్యానిస్తూ.. రాజకీయాల్లోకి రావొద్దనీ.. ఓసారి ఆలోచించుకోవాలనీ అన్నారు. చిరంజీవి వ్యాఖ్యలపై కమల్ హాసన్ స్పందించారు.


 

‘గెలుపోటముల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. సమాజంలో మార్పు కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. చిరంజీవి నాకెప్పుడూ సలహాలు ఇవ్వలేదు. చిరంజీవి అభిప్రాయం ఆయన స్వగతం. మా పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ప్రజల ఆలోచనా ధోరణిపై అవగాహన పెరిగింది. ఈ అవగాహనతోనే రాజకీయాల్లో ముందుకు వెళతాను’ అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు కమల్‌హాసన్ ప్రతిస్పందించారు. సినిమాల్లో చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్.. ముగ్గురూ సమాన హోదా అనుభవించారు. తమిళ్ లో కమల్, రజనీ మధ్య పోటీ ఉంటే తెలుగులో చిరంజీవికి పోటీనే లేకుండా పోయింది. చిరంజీవి రాజకీయాల్లో చాలా ఒడిదుడుకులనే ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో తనకు ఎదురైన పరిస్థుతులను, అనుభవాలను చిరంజీవి చెప్పుకొచ్చారు. కానీ కమల్ కు ఈ వ్యాఖ్యలు రుచించలేదు. ఇటువంటి విషయాల్లో ఎవరి నిర్ణయాలు వారివే అని చెప్పకనే చెప్పారు.

 


చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడానికి ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన చిరంజీవి కేవలం పదేళ్లలో అదే పరిశ్రమను శాసించే స్థాయికి, సౌత్ ఇండియాలోనే టాప్ 3లో ఒకడిగా ఎదిగిన తీరు ఎవరికైనా ఆశ్చర్యమే. అటువంటి వ్యక్తికి రాజకీయాల్లో ఎదురైన అనుభవాలు బాధాకరమనే చెప్పుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: