ఈ మధ్య స్పోర్ట్ ప్లేయర్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే సినిమాలు బాగా క్లిక్ అవుతున్నాయి. నాగ చైతన్య, నాని క్రికెర్టర్స్ గా నటించిన జెర్సీ, మజిలీ చిత్రాలే ఇందుకు ఉదాహరణ.
దీంతో  హీరోయిన్లు కూడా స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ కధలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. క్రికెటర్ గా రష్మిక  చేసిన డియర్ కామ్రేడ్ సినిమాయే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నా  కూడా అదే బాట పట్టబోతుందని తెలుస్తుంది. 

సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ హిట్లు తన ఖాతాలో వేసుకుంటూ పోతుంది. ఇటీవలే వెంకటేష్ సరసన 'ఎఫ్ 2' సినిమాలో ఆడిపాడిన ఈమె.. మరికొద్ది రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇదిలా ఉంటే ఇటీవలే గోపీచంద్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా వివరాలు ఈ మధ్యే అఫీషియల్‌గా ప్రకటించారు. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నా ఈ మూవీని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.ఇక  ఈ సినిమాలో  తమన్నా పోషించబోయే రోల్ విషయమై ఓ వార్త వినిపిస్తుంది. ఈ మూవీ లో మ‌హిళ‌ల క‌బ‌డ్డీ కోచ్‌గా త‌మ‌న్నా నటించబోతుందని సమాచారం. విభిన్న పాత్రలంటే మక్కువ చూపే తమన్నా ఈ ప్రాజెక్ట్ కి వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. ఇదే జరిగితే స్పోర్ట్స్ నేపథ్యంలో తమన్నా నటించిన తొలి సినిమా ఇదే అవుతుంది. 14 ఏళ్ల క్రిందట కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఎన్నో గ్లామర్ రోల్స్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే తమన్నాకి ఇన్నాళ్ళకి మరో వైవిధ్యమైన పాత్ర దక్కడం తో సంతోషంగా ఉందట.


గతంలో ఇదే సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలు చేసింది తమన్నా. ఈ రెండు సినిమాల్లోనూ తమన్నా పాత్ర కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం అయ్యుంది.కానీ  ఈ సినిమాలో మాత్రం  ఆమె గ్లామర్ డోస్ తో పాటు, నటనకి స్కోప్ ఉన్న పాత్రతో  స్పెషల్ ట్రీట్ ఇవ్వడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు.    మరి చూడాలి కబడ్డీ కోచ్ గా తమన్నా ఎలా కనువిందు చేస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: