తెలుగులో పవన్ కళ్యాణ్ ఆల్ టైం బెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటి అత్తారింటికి దారేది.  త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయ్యింది.  ఈ సినిమాకు భారీ క్రేజ్ వచ్చింది.  అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను ఈ మూవీ తిరగరాసింది.  ఆ తరువాత పెద్ద పెద్ద సినిమాలు వరసగా వచ్చాయి అనుకోండి అది వేరే విషయం.  పెద్ద పెద్ద సినిమాలు రావడం సూపర్ హిట్ కావడం అంతా జరిగిపోయింది.  


ఈ సినిమాను తమిళంలో శింబు హీరోగా, మేఘా ఆకాష్ హీరోయిన్ గా తెరకెక్కించారు. దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.  సినిమా రిలీజ్ అయ్యింది.  చాలా బాగా లాభాలు వస్తాయని అనుకుంటే.. తీరా సినిమా రిలీజ్ అయ్యాక.. చూసుకుంటే.. అట్టర్ ప్లాప్ అయ్యింది.  నష్టాలు కూడా తీవ్రస్థాయిలో ఉన్నాయి.  ఆ స్థాయిలో భారీ నష్టాలు రావడం ఏంటోమరి.  ఒక లాంగ్వేజ్ లో హిట్టైన సినిమా మరో లాంగ్వేజ్ లో ప్లాప్ అయ్యింది అంటే ఎలా అర్ధం చేసుకోవాలి. 


ఎందుకు ప్లాప్ అయినట్టు.  ఇప్పటి వరకు సినిమాకు డైరెక్ట్ గా నష్టం వచ్చింది అని నిర్మాతలు చెప్పలేదు. కానీ, లైకా సంస్థ ఇప్పటికే తమిళంలో అనేక సినిమాలు చేస్తూ లాస్ అవుతున్నది.  దీంతో శింబు నటించిన సినిమా వలన ఎంత నష్టం వచ్చిందో లెక్కచూసుకుంటే దాదాపు రూ. 14 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్టు తేలింది.  ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థ నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసింది.  


మాములుగా శింబు హీరోగా చేసే సినిమాలు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటాయి.  వివాదాలు చోటు చేసుకుంటుంటాయి. సమయానికి షూటింగ్ కు రారని, సినిమా షూటింగ్ విషయంలో వాయిదా వేస్తుంటారని అందరిని తెలిసిందే.  సినిమా పూర్తయ్యి రిలీజ్ అయ్యే సరికి పాపం నిర్మాతల తలప్రాణం తోకకు వస్తుంది. తెలుగులో సూపర్ హిట్టైన అత్తారింటికి సైతం సినిమా తమిళంలో ప్లాప్ అయ్యింది అంటే ఆ సినిమాను ఎలా తీశారో అర్ధం చేసుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: