తెలుగు లో వస్తున్న కామెడీ షో ‘జబర్ధస్త్’ తో పరిచయం అయిన సుడిగాలి సుధీర్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ ట్రైలర్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయ్యింది. సుడిగాలి సుధీర్ కి కమెడియన్ గా బాగా గుర్తింపు తెచ్చిన ప్రోగ్రాం జబర్దస్త్. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం తెలుగు తెరపై ఎక్కువగా జబర్ధస్త్ కమెడియన్లే దర్శనమిస్తున్నారు.  జబర్ధస్త్ తో మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకున్న వేణు,ధన్ రాజ్,తాగుబోతు రమేష్,చమ్మక్ చంద్ర,రాకెట్ రాఘవ ఇలా ఎంతో మంది కమెడియన్లుగా తమ సత్తా చాటుతున్నారు.  ఈ మద్య రిలీజ్ అయిన ‘ఇస్మార్ట్ శంకర్’ లో గెటప్ శీను హీరో రామ్ స్నేహితుడి పాత్రలో నటించి మంచిపేరు సంపాదించాడు.ఇక షకలక శంకర్ అయితే రెండు మూడు సినిమాల్లో హీరోగా వచ్చిన విసయం తెలిసిందే. ఇప్పటి వరకు  సుడిగాలి సుధీర్ ఇప్పటి చిన్న చిన్న పాత్రల్లో నటించినా.. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ఈ మూవీలో ఇటీవల కన్నుమూసిన  డాక్టర్ ఎన్ శివ ప్రసాద్ మంత్రిగా ఒక ప్రత్యేక పాత్రలో నటించారు..ఇదే ఆయన చివరి సినిమా. ఇక సినిమా అంటే  ప్రమోషలు చేయాల్సిన అవసరం ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఈ కమెడియన్ కం హీరో బిగ్ బాస్ షో ని ఎంచుకున్నాడు. ఇందుకోసం సుడిగాలి సుధీర్ బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

ఇక ట్రైలర్ లో డైలాగ్స్ కూడా చాలా కామెడీగా ఉన్నాయి.. ఐరన్ మాన్ కి అక్కలాగా..డైనోసార్ డాటర్ లా ఉన్నావ్...నువ్ కోచా,  హలో రావు గారు..చీపురి చూపిచ్చి కేజ్రీవాల్ సీఎం అయ్యారు..చాయ్ వాలా దేశానికే పీఎం అయ్యారు..నేను ట్రై చేస్తే నేను ఆ అమ్మాయికి బీఎఫ్ అవ్వలేనా, గన్ భలే తిప్పుతున్నావే అలవాటా..సినిమాలు చూడట్లేదా సార్, బాబు గారి పేరేంటే అంటే..చందు అంకుల్, చంద్రబాబు ఇంటూ చంద్రశేఖర్ రావు ఈజీకోల్ట్ చందు అంని నా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు..ఇలా సుధీర్ కొట్టే డైలాగ్స్ చూస్తుంటే సినిమా మంచి కామెడీగా సాగుతుందని తెలుస్తుంది.  మరి ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ సుడిగాల్ సుధీర్ అదృష్టం ఎలా ఉంటూందో రిలీజ్ తర్వాత తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: