ఈరోజు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు. అయితే పూరీకి ఈ పుట్టినరోజు ఒక విచిత్రమైన అనుభవం ఇస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పూరీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇండస్ట్రీ వర్గాలలోని అనేకమందితో పాటు అభిమానులు కూడ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.

అంతేకాదు పూరి మీద కవితాత్మక శైలిలో పోస్టులు పెడుతున్నారు. పూరీ సినిమాలను అతడు క్రియేట్ చేసిన క్యారెక్టర్లను గుర్తుకు చేసుకుంటూ పూరీని మించిన డాషింగ్ డైరెక్టర్ లేడని పొగడ్తలు గుప్పిస్తున్నారు. అంతేకాదు పూరి జగన్నాథ్ కొంతమంది అవకాశాలు లేని దర్శకులకు ఆర్ధిక సహాయం చేసే ప్లాన్ ప్రకటించడంతో పూరీని దాసరినారాయణరావు స్థాయిలో పొగుడ్తూ కొంతమంది చేస్తున్న హడావిడి ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

గత సంవత్సరం ఇదే రోజున పూరీ గురించి ఒక్కరు కూడ పట్టించుకుని అతడికి శుభాకాంక్షలు తెలిపిన సందర్భాలు గత సంవత్సరం ఒక్కటి కూడ గుర్తు లేదనే చెప్పాలి. అయితే ఒక్క ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సస్ ఇప్పుడు పూరీని మళ్ళీ క్రేజీ డైరెక్టర్ గా మార్చివేసి టాప్ హీరోలందరూ పూరీ వైపు చూసేలా పరిస్థితులు మారిపోవడం చాలామందికి షాక్ ఇస్తోంది. 

ఆ మధ్య ‘ఇస్మార్ట్ శంకర్’ ను ప్రమోట్ చేస్తూ పూరి ఒక విచిత్రమైన కామెంట్ చేసాడు. ఒక సక్సస్ వచ్చినతరువాత వరుస పెట్టి వచ్చే జనం ఒకేఒక్క ఫెయిల్యూర్ వచ్చిన తరువాత కనీసం మర్యాదకు కూడ పలకరించరు అంటూ ఇండస్ట్రీ తీరు పై పూరి షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు సక్సస్ తరువాత ఎదో ఒక సినిమాను తీయమని బలవంత పెడుతూ తనను పోగుడ్తున్న వాళ్ళే తనచేత పొరపాట్లు చేయించి తనకు మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చేలా చేస్తారు అంటూ పూరి చేసిన కామెంట్ మధ్య ఈరోజు ‘సాహో’ మ్యానియాతో సమానంగా పూరీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: