సినిమాల్లోకి వారసత్వంతో వచ్చేవాళ్లకు బేసిక్ ప్లాట్ ఫామ్ రెడీగా ఉంటుంది. వారికి అదృష్టంతోపాటు కష్టాలు కూడా ఉంటాయి. అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను ఖచ్చితంగా అందుకోవాలి. అదే ఓ సూపర్ స్టార్ వారసుడిగా వస్తే మరిన్ని సవాళ్లు అధిగమించాలి. లేదంటే మొదటి ప్రయత్నంలోనే తేలిపోతారు. తెలుగు సినిమాను రెండు దశాబ్దాలుగా ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ ను సినీమాల్లోకి వచ్చాడు. ‘చిరుత’తో సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్ నేటితో 12 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

 


పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా 2007 సెప్టెంబర్ 28న విడుదలయింది. డ్యాన్సులు, ఫైట్స్, యాక్షన్.. అన్నింట్లో పర్ఫెక్షన్ చూపించి తొలి సినిమాతోనే హిట్ కొట్టి మెగాస్టార్ కు తగ్గ వారసుడు అనిపించుకున్నాడు. ఇప్పటివరకూ ఓ డెబ్యూ హీరోగా ఆ సినిమా సాధించిన కలెక్షన్లు ఇప్పటికీ చిరుత పేరు మీదే ఉన్నాయి. రెండో సినిమాగా వచ్చిన మగధీర కలెక్షన్లలో ఓ చరిత్రే సృష్టించింది. గతేడాది వచ్చిన రంగస్థలంతో నటుడిగా చరణ్ ఎంత రాటుదేలాడో ఆ సినిమా సాధించిన ఇండస్ట్రీ హిట్ చెప్తుంది. ఓ నెంబర్ వన్ హీరో నట వారసుడిగా వచ్చిన చరణ్.. తానూ ఓ స్టార్ హీరోగా ఎదగడం విశేషం. హీరోతో పాటు నిర్మాతగా కూడా మారిన చరణ్ తండ్రితో ఖైదీ నెం.150తో తొలి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు సైరా నరసింహారెడ్డితో 280కోట్ల బడ్జెట్ తో సినిమా తీసి భారీ నిర్మాతగా మారిపోయాడు.

 


తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి గర్వపడే స్థాయిలో చరణ్ ఉండడం ఆయన గర్వపడే విషయమే. పరిశ్రమలో రెండు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నాడు. ప్రస్తుతం సైరా రిలీజ్ పనుల్లో నిమగ్నమైన చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి భారీ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: