నందమూరి అందగాడు బాలక్రిష్ణ నటిస్తున్న 105 మూవీ ఇపుడు శరవేగంగా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంటోంది.  బాలయ్య ఒకసారి రంగంలోకి దిగాలే కానీ ఆయన స్పీడ్ కి అడ్డు ఉండదన్నది తెలిసిందే. బాలయ్య హీరోగా డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తీస్తున్న మూవీలో ఎన్నో విశేషాలు  ఉన్నాయి. ఈ మూవీలో బాలయ్య  సక్సెస్ ఫుల్ సెంటిమెంట్ హీరోయిన్ సోనాలి చౌహన్ మెయిన్ లీడ్ లో కనిపిస్తుంది.


ఇక బాలయ్య మూవీని సంక్రాంతి పందెం కోడీగా తీసుకురావాలనుకుంటున్నాడని టాక్. ఈ మూవీని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఆయన సైతం సంక్రాంతికి ఠియేటర్ల గురించి అపుడే వేట మొదలెట్టశాడట. కొత్త మేకోవర్ తో బాలయ్య నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.


బాలయ్య ఫిల్మ్ హిస్టరీలో మొదటిసారిగా ముప్పయి కోట్ల భారీ బడ్జెట్ తో రూలర్ మూవీని నిర్మిస్తున్న సంగతి విధితమే. బాలయ్య మీద ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడం అంటే రిస్క్ గానే చూడాలి. అయితే నిర్మాత సి కళ్యాణ్ మాత్రం బాలయ్య మూవీ లాభాల పంట పండిస్తుందని చెబుతున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి ఒక్కో అప్  డేట్ ని రివీల్ చేస్తూ హైప్ పెంచే కసరత్తు మొదలైంది. ఇక చూడాలి మరి.



ఇక ఈ మూవీకి సంబంధించి టీజర్ ని దసరా పండుగ వేళ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోందట. ఈ టీజర్ మరి ఎలా ఉంటుందో. బాలయ్య అసలే కొత్తగా కనిపిస్తున్న ఈ మూవీలో అందాల భామలు వేదిక, సోనాలి చౌహాన్, అలనాటి హీరోయిన్ భూమిక, ఇంకా జయసుధ, ప్రకాష్ రాజ్ వంటి వారెందరో ఉన్నారు. ఈ మూవీకి రూలర్ అన్న టైటిల్ ఫైనల్ చేస్తారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: