టాలీవుడ్ లో ఎన్నో కామెడీ సినిమాల్లో తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి. టాలీవుడ్ లో రవితేజ- శ్రీనివాస్ రెడ్డి కాబినేన్ లో వచ్చిన కామెడీ సీన్లు పడి పడీ నవ్వుతారు. ఆ మద్య అనీల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో వీరిద్దరి కాంబినేష్ వచ్చే కామెడీ నవ్వులు పూయించారు. ఓ వైపు కమెడియన్ గా నటిస్తూనే మరోవైపు హీరోగా నటిస్తున్నాడు.

దర్శకుడు పూరీ జగన్నాధ్ తన సినిమాల్లో మంచి పాత్రలను ఇచ్చి ఇతడిని ప్రోత్సహించాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా శ్రీనివాస్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బుల్లితెరపై చిన్నిచిన్న పాత్రల్లో కనిపించాడు.  పూరీ జగన్నాధ్  దర్శకత్వంలో రవితేజ హీరోగా ఫస్ట్ సినిమా ‘ఇడియట్’ లో స్నేహితుడి పాత్రలో నటించి మంచి కామెడీ పండించాడు. ఇందులో బాగా నటించిన శ్రీనివాస రెడ్డి, మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుని విజయపధంలో దూసుకుపోయాడు. కేవలం కమెడియన్ గానే కాకుండా హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’..గీతాంజలి, జంబలకిడిపంబ పరవాలేదు అనిపించాయి. 

తాజాగా  శ్రీనివాసరెడ్డి దర్శక నిర్మాతగాను తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగంలోకి దిగిపోయాడు. తను ప్రధానమైన పాత్రను పోషిస్తూ, దర్శక నిర్మాతగా ఆయన చేసిన చిత్రమే 'భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు'. తాజాగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్టులుక్ ను విడుదల చేశాడు. శ్రీనివాసరెడ్డితో పాటు ఈ సినిమాలో షకలక శంకర్,  సత్య ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 'మంచి రసగుల్లా లాంటి సినిమా' అంటూ వదిలిన ఈ పోస్టర్లో ఈ ముగ్గురూ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: