మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. మొదటి తెలుగు స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల కోసం తెలుగు ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ రెండు  ట్రైలర్ లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. పాజిటివ్ టాక్ తో సినిమా విడుదల  కాబోతుంది

 

 

 అయితే 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో... ఏ చిన్న తప్పు జరిగినా అది సినిమాకు పెద్ద మైనస్ గా మారుతుంది. కాస్ట్యూమ్స్ విషయంలో అయితే కాస్ట్యూమ్స్ ఏమాత్రం బెడిసికొట్టిన ఆ పాత్రకి సరైన రూపం రాదు. అందుకే సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ పాత్ర కీలకమని చెప్తారు . కాగా  సైరా సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ గా  పనిచేసిన చిరంజీవి కూతురు సుస్మిత సైరా సినిమా కాస్ట్యూమ్స్ గురించి ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది. 

 

 

 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 18వ శతాబ్దానికి సంబంధించిన వాడు కావడంతో 18వ శతాబ్దానికి సంబంధించిన దుస్తులు అలంకరణ వస్తువులు ఎలా వాడారో  తెలుసుకోవడానికి తన కాలేజీ లైబ్రరీలో  హిస్టరీ బుక్ తిరగేయటంతో  సమాచారం సేకరించి రఫ్ స్కెచ్ వేసుకుని ఫాబ్రిక్  తయారు చేయడం ఆ దుస్తులు ఏ రంగులో ఉండాలి బాగా ఆలోచించి తయారు చేసాం అని చెప్పారు. సినిమాలో  నాలుగు లీడ్ రోల్స్ కి కాస్ట్యూమ్స్ డిజైన్ చేశానని... మిగిలిన లీడ్ రోల్స్ కి ఉత్తరా మీనన్  డిజైన్ చేశారని చెప్పారు. అయితే ఈ సినిమాకి చిరంజీవి గారి కూతురులా  కాకుండా ఒక కాస్ట్యూమ్ డిజైనర్ గా  పని చేశానని తెలిపారు. సినిమా ట్రైలర్ విడుదల అవగానే కాస్ట్యూమ్స్ డిజైన్స్ కోసం పడ్డ కష్టాన్ని మొత్తం మర్చిపోయానని  అని ఆమె తెలిపారు. కాగా అమితాబచ్చన్ తో కలిసి పనిచేయడం ఒక పెద్ద లర్నింగ్ ప్రాసెస్ అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: