మెగాస్టార్  చిరంజీవి  డ్రీం ప్రాజెక్ట్  సైరా  మరి కొద్ది రోజుల్లో  థియేటర్లలోకి రానుంది.   దాంతో ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో  బిజీ గాఉంది.  ఈ చిత్రం  తెలుగు తోపాటు  తమిళ. కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదలకానుందని తెలిసిందే. ఇక సైరా తమిళ వెర్షన్ కు  కమల్ హాసన్  వాయిస్ ఓవర్ ఇవ్వగా..   చిరంజీవి పాత్ర కు  ప్రముఖ నటుడు అరవింద స్వామి డబ్బింగ్ చెప్పాడు.  ఇంతకుముందు అరవింద స్వామి తెలుగులో  రామ్ చరణ్ నటించిన  ధ్రువ అనే చిత్రంలో విలన్ గా నటించాడు. ఇటీవల  అరవింద స్వామి ని కలిసి చరణ్ సైరా లో చిరు పాత్రకు డబ్బింగ్ చెప్పాలని అడిగాడట.  దాంతో వెంటనే  డబ్బింగ్ చెప్పడానికి అరవింద స్వామి ఓకే చెప్పాడట. 


కాగా మలయాళ వెర్షన్ కు సూపర్ స్టార్  మోహన్ లాల్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తొలి తరం  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో  అమితాబ్ బచ్చన్ ,  విజయ్ సేతుపతి , రవికిషన్ , జగపతి బాబు ,  సుధీప్ , తమన్నా  ముఖ్య పాత్రల్లో నటించగా  నయనతార కథానాయికగా నటించింది.  భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై  రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రం  అక్టోబర్ 2న గాంధీ జయంతి  సందర్భంగా విడుదలకానుంది.  ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ , ట్రైలర్లు  సినిమా ఫై  భారీ హైప్ ను క్రియేట్ చేశాయి.  ఇక  ఒక్క హిందీ లో తప్ప దాదాపుగా అన్ని భాషల్లో సోలో గా విడుదలవుతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: