టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో. బన్నీ సరసన గోల్డెన్ లెగ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో సామజవరగమనా అనే పల్లవితో సాగె తొలి సాంగ్ ని నేటి ఉదయం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. మంచి యూత్ ఫుల్ రొమాంటిక్ స్టయిల్ లో సాగిన ఆ సాంగ్, ప్రస్తుతం అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది. 

ఇకపోతే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి సినిమా యూనిట్ ఒక చిన్న మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అది తెలుగు టైటిల్ లో కాదు, ఈ సినిమాకు ఇప్పటివరకు ఇంగ్లీష్ లో Ala Vaikuntapuramlo అనే ట్యాగ్ తో ప్రమోట్ చేయగా, ఇకపై కొత్తగా సరికొత్త న్యూమరాలజీ ప్రకారం ఈ ఇంగ్లీష్ టైటిల్ కి మరొక r అక్షరాన్ని చేర్చి Ala Vaikuntapurramlo గా మార్పు చేయడం జరిగింది. నిజానికి సినిమా వాళ్లకు సెంటిమెంట్ల పై కొంత నమ్మకం ఎక్కువ అనే చెప్పాలి. ఈ విధంగా మార్పు చేయడం వలన తమ సినిమాకు బాగా కలిసొస్తుందని భావించిన సినిమా యూనిట్, నేటి నుండి ఈ చిన్న మార్పును కొనసాగించనుంది. 

మంచి ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా, త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాల మిళితంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటివరకు బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు అందుకోగా, ఈ సినిమా కూడా తప్పకుండా విజయవంతమై, వారిద్దరి కాంబోలో హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయమని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: