మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భారీ పాన్ ఇండియా చిత్రం సైరా నరసింహారెడ్డి దాదాపు 200 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసిందన్నది హాట్ టాపిక్. తెలుగు-తమిళం-హిందీ-మలయాళం-కన్నడ భాషల్లో ఈ చిత్రం అత్యంత భారీగా రిలీజవుతోంది. బడ్జెట్ ఎంత? అంటే దాదాపు 270 కోట్లు వెచ్చించామని కొణిదెల కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 


ఇక డిజిట‌ల్ రైట్స్‌, శాటిలైట్ రైట్స్ మొత్తం రు.125 కోట్లకు అమ్ముడైన‌ట్టు తెలుస్తోంది. ఇక సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు అయిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2వ తేదీన ఈ సినిమా ఐదు భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.


ప్రపంచ వ్యాప్తంగా సైరా మొత్తం బిజినెస్ సుమారు 200 కోట్ల మేర బిజినెస్ సాగింది. దీనికి ఏరియా వైజ్ ప్రింట్ .. పబ్లిసిటీ ఖర్చులు వేరే ఉంటాయి. సైరా సినిమా హిట్టు అని చెప్పాలంటే 200-240 కోట్ల మేర షేర్ వసూలు చేయాలి.  300 కోట్లు అంతకుమించి తే బ్లాక్ బస్టర్ హిట్టు అయిన‌ట్టే. మ‌రి బిగ్ టార్గెట్‌తో మెగాస్టార్ సైరాతో బాక్సాఫీస్ జ‌ర్నీ స్టార్ట్ చేయ‌బోతున్నాడు.


సైరా వ‌ర‌ల్డ్ వైడ్ ఏరియాల వారీ ప్రి రిలీజ్ బిజినెస్ ( రూ.కోట్ల‌లో ) :
నైజాం - 30 కోట్లు
సీడెడ్ - 22 కోట్లు
నెల్లూరు - 5.20 కోట్లు
కృష్ణా - 9.60 కోట్లు
గుంటూరు - 11.50 కోట్లు
వైజాగ్ - 14.40 కోట్లు
ఈస్ట్ - 10.40 కోట్లు
వెస్ట్ - 9.20 కోట్లు
---------------------------------------------
ఆంధ్రా + తెలంగాణా =112.30 కోట్లు
-----------------------------------------------
కర్ణాటక - 28 కోట్లు
తమిళనాడు - 7.50 కోట్లు
కేరళ - 2.50 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - 27.50 కోట్లు
విదేశాలు - 20 కోట్లు
---------------------------------------
వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్ = 200 కోట్లు
---------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: