తెలుగులో విజయ్ దేవరకొండ తర్వాత ఆ స్థాయిని మించిన హీరో ఆర్ ఎక్స్ 100 కార్తికేయ.. మొదటి సినిమాతో బాగా పాపులారిటీని సొంతం చూసుకున్నాడు అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే మొదటి సినిమా ఓ రేంజులో హిట్ అవ్వడంతో రెండో సినిమా కూడా హిట్ అవుతుందని చాలా అసలు పెట్టుకున్న ఈ హీరో కి నిరాశే ఎదురైంది. 




రెండో సినిమాగా హిప్పీ సినిమాలో రొమాంటిక్ అబ్బాయి పాత్రలో నటించాడు కానీ ఆ సినిమా కూడా ఈ కుర్రాడికి హిట్ ఇవ్వలేదనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన గుణ ౩69  సినిమా కూడా ఈ కుర్రాడికి హిట్ ఇవ్వలేదనే చెప్పాలి. దీనితో బాడీ ఉంటె సరిపోదు బ్రెయిన్ ఉండాలి అని అనుకున్నాడేమో మొన్న వచ్చిన నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.




ప్రస్తుతం కార్తికేయ కొత్త సినిమాలో నటిస్తున్నాడు ఆ సినిమానే 9౦ ఎం ఎల్. పేరుకు తగ్గట్లే సినిమా మొత్తం తాగుడు గురించి ఉంది.  మా డాక్టర్ రోజుకు కొద్దిగా మందు తాగమన్నాడు అంటూ హీరో చెప్పే డైలాగు ఆ సినిమాకు ఊపును తీసుకొచ్చింది. మొన్న రిలీజ్ అయినా పోస్టర్ మరియు టీజర్ ఆ సినిమాకు మంచి పేరును తీసుకొచ్చింది. 




ప్రస్తుతం ఈ సినిమాలో మరో పోస్టర్  వచ్చింది ఆ పోస్టర్ లో హీరో కి ప్రియురాలు పాలసీసాలో మందు వేసి చిన్నపిల్లాడికి తాపిస్తుంది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇకపోతే ఈ ఇలాంటి ప్రేయసి ఉంటె ఏ ప్రియుడు మాత్రం ఆమెను వదిలేస్తాడు అంటూ అందరు కామెంట్లతో నింపేస్తున్నారు.ఆ సినిమా అయినా హిట్ అవుతుందో లేదో చూడాలి...


మరింత సమాచారం తెలుసుకోండి: