అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్‌ దేవరకొండకి యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. విజయ్ సినిమాలకి మినిమం గ్యారెంటీ ఓపెనింగ్స్‌ ఇస్తోంది ఒకరకంగా యూత్ అనే చెప్పాలి. అదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా అతని సినిమాలు రీచ్‌ అయితే 'గీత గోవిందం' స్థాయిలో సక్సెస్‌ అవుతాయనేది తేలిపోయింది. మొదటి సినిమా పెళ్ళి చూపులు, యావరేజ్ గా ఆడిన ద్వారక, గీత గోవిందం అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అయినా కానీ యూత్ కే ఎక్కువగా విజయ్‌ ప్రాధాన్యత ఇస్తున్నాడని అర్థమవుతోంది.

విజయ్‌.. ని రెబల్‌ గా నటిస్తున్న క్యారెక్టర్స్ లో చూడ్డానికి మాత్రమే యూత్‌ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రతి సినిమాలోను అలాంటి క్యారెక్టర్స్ నే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక ప్రతి సినిమాలోను గడ్డం పెంచి కనిపించే సీన్స్ కొన్ని వుండాలని దర్శకులకి సూచిస్తున్నాడట. డియర్‌ కామ్రేడ్‌ ఫెయిల్‌ అయినా కానీ విజయ్‌ ఇంకా తన తప్పు తెలుసుకోవడంలేదు. యూత్‌కి నచ్చే ఎలిమెంట్స్‌ని మాత్రం కవర్‌ చేస్తూ తన సినిమాలు అన్ని వర్గాలకీ రీచ్‌ అయ్యేట్టు చూసుకోకపోతే తనకున్న క్రేజ్‌ మొత్తం ఒక్కసారిగా పడిపోవడం పక్కా అని ఇప్పుడు ఇండస్ట్రీలో అందరు చెప్పుకుంటున్నారు.

విజయ్‌ సినిమాలని ఫ్యామిలీతో కలిసి స్ట్రీమింగ్‌ యాప్స్‌లో చూడాలన్నా కూడా కాస్త ఆలోచించాల్సినట్టుగా కొన్ని అవసరం లేని సీన్స్ ని తన సినిమాలలో కేవలం యూత్ కోసమే ఇరికిస్తున్నాడు. ఈ విషయంలో తనని రైట్‌గా గైడ్‌ చేసేవాళ్లు లేకపోవడం, సినీ నేపథ్యం లేకపోవడం కూడా ఇందుకు కారణమే అని అంటున్నారు. అలాగే తన మాట వినే దర్శకులతోనే సినిమా చేస్తున్నాడు తప్ప తనని కమాండ్‌ చేసే వారికి ఛాన్స్‌ ఇవ్వట్లేదని మరో టాక్ కూడా వస్తోంది. మరి ఇలా అయితే విజయ్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగడం కష్టమని చెప్పక తప్పదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: