కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 10వ వారాలు పూర్తి చేసుకుంది. వారం మొత్తం కంటెస్టంట్స్ చేసిన తప్పొప్పులకు వారాంతరంలో హోస్ట్ వచ్చి అడిగి కడిగి పారేయడం కామనే. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో కూడా నాగార్జున తన ఎనర్జిటిక్ యాంకరింగ్ తో అదరగొట్టాడు. ఈ వారంలో జరిగిన వరుణ్, రాహుల్ గొడవతో మొదలు పెట్టిన నాగ్ గొడవకు కారణమైన ఇద్దరిని వివరాలు అడిగి తెలుసుకున్నాడు.


అయితే హోస్ట్ గా ఇద్దరికి క్లారిటీగా జరిగిన విషయాన్ని చెప్పి మళ్లీ వాళ్లిద్దరిని కలిపాడు నాగార్జున. వరుణ్, రాహుల్ ఆ గొడవ జరిగిన దగ్గర నుండి మాట్లాడుకోవడం మానేశారు. నాగార్జున సర్ధి చెప్పడంతో ఒకరికొకరు సారీలు చెప్పుకుని కలుసుకున్నారు. ఇక పునర్నవిని కూడా నాగార్జున మందలించడం జరిగింది.


తను మాట్లాడే మాటలను కాస్త ఆచి తూచి మాట్లాడాల్సిందిగా కోరాడు నాగ్. ఇక బాబా భాస్కర్ మాస్క్ తీసి ఆడుతున్నాడని మూడు వీడియో క్లిప్స్ చూపించి శ్రీముఖిపై బాబా అసలు ఫీలింగ్ ను బయట పెట్టాడు నాగ్. ఆ తర్వాత శ్రీముఖి బాబా చేసిన పనికి అప్సెట్ అయ్యింది. అయినా సరే బాబా మీద రెస్పెక్ట్ ఎప్పటికి ఉంటుందని చెప్పింది.


ఇక ఈ వారం నామినేషన్స్ లో వరుణ్, రవి కృష్ణ, బాబా భాస్కర్, శ్రీముఖి ఉన్నారు. అయితే వరుణ్ సందేష్ ఆల్రెడీ సేఫ్ అవడం జరిగింది. ఇక మిగిలిన ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో సండే ఎపిసోడ్ లో తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం రవి కృష్ణ ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తుంది. అలి రెజా రీ ఎంట్రీ బాబా భాస్కర్ మాస్క్ తీసి ఆడటం ఇలా చూస్తుంటే రాఉన్న వారాల్లో ఆట మరింత రసవత్తరంగా ఉంటుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: