‘సైరా’ ను ప్రమోట్ చేస్తూ ఈరోజు ఒక తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమూవీ గురించి అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేస్తూ చిరంజీవి యాంటి సెంటిమెంట్ కోసం ‘సైరా’ విషయంలో చరణ్ ను పక్కకు తప్పించిన విషయాలను వివరించాడు. వాస్తవానికి ‘సైరా’ మూవీలో ఇంటర్వెల్ ముందు వచ్చే షేర్ ఖాన్ పాత్ర చాల కీలకం అంటూ ఆ పాత్రకు సంబంధించి కొన్ని విషయాలను బయట పెట్టాడు.

వాస్తవానికి మొదట్లో ఈ పాత్రను సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లలో ఎవరో ఒకరిచేత నటింప చేద్దామని ప్రయత్నించిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే దర్శకుడు సురేంద్ర రెడ్డి సూచనతో ఈ పాత్రను చరణ్ చేత నటింప చేశామని కానీ ఒక యాంటీ సెంటిమెంట్ గుర్తుకు వచ్చి తాను చరణ్ పాత్రను ‘సైరా’ నుంచి తొలగించిన ఆసక్తికర విషయాన్ని చిరంజీవి బయట పెట్టాడు. 

ఈ కథలో తనతో పోరాటం చేసే ఆ షేర్ ఖాన్ పాత్ర ‘నరసింహా రెడ్డి నీలాంటి వాడు దేశానికి కావాలి’ అంటూ నా చేతిలోని కత్తిని తీసుకుని పొడుచుకుని చనిపోయే సీన్ ను చిత్రీకరించిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే నా పాత్ర చేతిలో చరణ్ చనిపోవడం తన కుటుంబ సభ్యులకు ముఖ్యంగా తన భార్య సురేఖకు నచ్చక పోవడంతో యాంటీ సెంటిమెంట్ తో ఆ సీన్ ను తొలిగించిన విషయాన్ని బయట పెట్టాడు. 

దీనితో ‘సైరా’ లో నటించే ఛాన్స్ చరణ్ జస్ట్ మిస్ అయ్యాడు అంటూ చిరంజీవి జోక్ చేసాడు. అయితే నిర్మాతగా ఈ మూవీలో తన సమర్ధతతో అందరినీ ఆకట్టుకున్నాడని అందరూ చరణ్ ప్రశంసిస్తూ తన వద్ద కామెంట్స్ చేస్తూ ఉంటే చరణ్ లాంటి కొడుకు తనకు పుట్టడం తన అదృష్టం అన్న భావన కలుగుతోంది అంటూ చిరంజీవి చరణ్ పై ప్రశంసలు కురిపించాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: