హృతిక్ రోషన్ .. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్ ఇండియా మొత్తం తెలుసు ఈ అందగాడి గురించి. అయితే ఇప్పుడు అయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'వార్'. సిద్దార్థ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం హృతి రోషన్ చాలా ఫిట్ గా తయారయ్యాడు. ఈ నేపథ్యంలోనే హృతిక్ మాట్లాడుతూ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ గురించి తన మనసులో మాట చెప్పాడు. 


'వార్‌' సినిమా ప్రమోషన్‌లో భాగంగా హృతిక్ మాట్లాడుతూ 'ఈ సినిమా నన్ను మళ్లీ వెనక్కి తీసుకెళ్లింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ అనేది నా ఫేవరెట్‌ జోనర్‌. ఐ లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌. గతంలో అటువంటి సినిమాలు చేసే అవకాశం చాలా తక్కువగా వచ్చింది. ఆ చిత్రాలు చేసే ఛాన్స్‌ వచ్చినప్పుడే ఆ జోనర్‌ అంటే నాకిష్టమని చెప్పాను కూడా. వాస్తవంగా నేను యాక్షన్‌ చిత్రాలనే చేయాలనుకుంటాను. కానీ అటువంటి వాటికి మంచి కథలు రావడం చాలా కష్టం. ఈ జోనర్‌కి ఇంటిలిజెంట్‌ స్క్రిప్ట్‌ కావాలి' అంటూ చెప్పుకొచ్చారు. 


కాగా ఈ సినిమాలో నటించిన షారుఖ్‌ ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, సంజరు దత్‌, ఫర్హాన్‌ అక్తర్‌ వంటి స్టార్స్ గురించి హృతిక్ రోషన్ మాట్లాడుతూ ''ఇలాంటి సినిమాలు నమ్మదగిన వాళ్లతోనూ, తమ స్టార్‌డమ్‌కు ఇబ్బంది లేదనుకునే వాళ్లతో చేయాలి. మన చిత్రసీమలో స్టార్స్‌కు చాలా అభద్రతా భావం ఉంది. ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి. 'వార్‌' సినిమా విషయంలో ఆ ఇబ్బంది లేదు. మేమంతా కలసి మంచి సినిమా చేయగలమని టైగర్‌ ష్రాఫ్‌, నేను దర్శకుడ్ని బాగానే నమ్మాం. పాత్రలన్నీ బాగా రావాలని ఎవరికి వారు తీవ్రంగా కృషి చేశాం' అని చెప్పారు. దీంతో ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: