బాబోయి ఇంతందమా. ఇలా ఆరబోయటమా. ఆ బ్రహ్మదేవుడు ఇచ్చింది రెండు కళ్ళేగా. ఎలా చూడడం. పైగా చిట్టి గుండెనే పెట్టిపోయాడు దేవుడు. లబ్ డబ్ ల ఆ గుండె ఈ పరువాల హోరులో పాదరసమా జారిపోతే ఎలా తట్టుకోవడం. ఇదే ఇపుడు కుర్రోళ్ళకు అ అతి పెద్ద ప్రపంచ సమస్యగా ఉంది. ఆ ట్రబుల్ క్రియేట్ చేసిన అందాల ముద్దు గుమ్మ మాత్రం తనకేం పట్టనట్లుగా ఉంది. అందం శరణం గత్యామీ అంటూ కుర్రోళ్ళు జపం చేస్తూంటే సెక్సీ లుక్స్ తో చంపెస్తోంది. అంతలోనే వాళ్లను బతికించేస్తోంది.


ఇంతకీ ఇంతలా రెచ్చిపోతున్న ఈ అమ్మడు కధేంటి అంటే ఆమె పేరు మాళవిక మోహనన్. మహర్షి  సినిమాకు ఛాయాగ్రహణం అందించిన మోహనన్ గారాలపట్టి ఈ అమ్మడు. అచ్చం సౌతిండియా సొత్తు ఈ ముద్దుగుమ్మ. కానీ బాలీవుడ్ ని మించిపోయే రేంజిలో ఆందాలను ఆరేస్తోంది. సోషల్ మీడియా అంతా తానే అయి హోరెత్తిస్తోంది.


నన్ను చూడని కళ్ళు కళ్ళే కావు అంటోంది. వాటికి పుణ్యం దక్కాలంటే తన సొగసు ఒక్కసారి చూడాల్సిందేనని రెచ్చగొడుతోంది. అన్నీ ఉన్న ఈ అమ్మడు టాలీవుడ్ కి సరైన ఫిగర్ అంటున్నారు. ఆమె రజనీకాంత్  పేట సినిమాలో అతని చెల్లెలి పాత్రలో కనిపించింది. ఆ తరువాత ఆమెకు పెద్దగా అవకాశాలు లేవట. తమిళ్ హీరో విజయ్ పక్కన ఓ మూవీ అంటున్నారు కానీ అది కూడా ఇంకా కన్ ఫర్మ్ కాలేదు.


అయితే ఈ అందగత్తెను తెలుగు వెండితెర మీద తొందరలోనే చూసేయవచ్చు అంటున్నారు. విజయ్ దేవరకొండతో మైత్రీ మూవీస్ తీస్తున్న హీరో అన్న సినిమాలో మాళవిక హీరోయిన్ గా బుక్ అయిందని టాక్. ఈ మూవీకి ఆనంద్ అన్నామళీ అన్న కొత్త దర్శకుడు డైరెక్టర్ గా ఉంటాడుట. మొత్తానికి తెలుగులో పరువాల జడివాన కురిపించేందుకు మాళవిక రెడీ అంటోంది. మరింకేం.  కొట్టారు  కుర్రకారు చాన్స్. ఇక మాళవిక అందాలు అదరహో అంటే అంటే బెదరకుండా చూడడమే యూత్ వంతు


మరింత సమాచారం తెలుసుకోండి: