గతకొద్ది రోజులుగా ఉయ్యాలవాడ కుటుంబానికి చెందిన వారసులు ‘సైరా’ మూవీ విషయంలో తమకు నిర్మాత చరణ్ చిరంజీవిలు అన్యాయం చేసారు అంటూ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై వారు కోర్టు మెట్లు కూడ ఎక్కారు. 

ఈ వివాదాల పై ఇప్పటి వరకు స్పందించని చిరంజీవి మొట్టమొదటి సారిగా తన మౌనాన్ని వీడాడు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారసులు చాల అమాయకులు అంటూ కొందరు వేసిన ఉచ్చులో ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు పడిపోయారని అంటూ వాస్తవానికి ‘సైరా’ నిర్మాణ విషయంలో వ్రాసి ఇచ్చిన ఎగ్రిమెంట్ విషయాలను వివరించాడు.

ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల ఆర్ధిక స్థితి అంతంత మాత్రమే అన్న విషయం తనకు తెలుసని అందువల్లనే తాను సినిమా రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి ఎస్.వి ప్రసాద్ కు ఈ విషయాన్ని సామరస్యంగా మాట్లాడి సెటిల్ చేయమని చెప్పిన విషయాలను బయటపెట్టాడు. ఉయ్యాలవాడ వారసులం అని చెప్పుకునే కుటుంబాలు 25 వరకు ఉన్నాయని అయితే వారందరికీ ఆర్ధిక సహాయం చేయాలి అనే కోరిక మంచిదే అయినా కుటుంబానికి రెండు కోట్ల చొప్పున 50 కోట్లు ఎవరైనా ఇస్తారా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

వాస్తవానికి 100 సంవత్సరాల తరువాత ఎవరైనా ఒక వ్యక్తి చరిత్ర సినిమాగా తీయవచ్చు అన్న విషయం ‘మంగళ్ పాండే’ మూవీ విషయంలో కోర్టులు చెప్పాయని తాము అదే తీర్పును గౌరవిస్తున్న విషయాన్ని తెలియచేసాడు. అంతేకాదు సానుభూతితో ఈ 25 కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేస్తే మరిన్ని కుటుంబాలు తాము కూడ వారసులం అంటూ తెర పైకి వస్తే తమ పరిస్థితి ఏమిటి అంటూ కామెంట్ చేయడమే కాకుండా వారి వద్ద ఉన్న ఎగ్రిమెంట్స్ లో ఎటువంటి సంతాకాలు లేవనీ తాము వారికి డబ్బు ఇవ్వవలసిన అవసరం చట్టపరంగా లేదు అంటూ కామెంట్స్ చేసాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: