కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన భయంకర సినిమా అరుంధతి.. ఆ సినిమాలో అరుంధతి పాత్రలో నటించింది అనుష్క శెట్టి. ఆయన డైరెక్షన్, ఈమె అద్భుతమైన యాక్షన్ చాలా మందిని ఆకట్టుకుంది. కొంచం భయంతో అంతకు మించిన ప్రేమతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా ఇప్పుడు హిందిలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు బాలీవుడ్ సినీ దర్శకులు. 



ఇకపోతే ఈ సినిమాలో అనుష్క పాత్రను బీట్ చేసే రేంజులో ఏ హీరోయిన్ చేస్తారు ఆలోచనలో పడ్డారు ఆ బాలీవుడ్ సినీ వర్గాలు. మరి ఆ పాత్రకోసం. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు అయినా అనుష్క శర్మ, కరీనా కపూర్ లో ఎవరిని తీసుకోవాలి అనే ఆలోచనలు చేస్తున్నారు. మరి ఎవరు ఆ పాత్రకు సూట్ అవుతారో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే. 



విషయానికొస్తే.. తెలుగులో అరుంధతి వచ్చి దాదాపుగా పదేళ్లు దాటింది. ఇప్పుడు హిందీలో రీమేక్ రావడం ఏంటి అని అందరు ఆలోచనలో పడ్డారు. మొదట ఈ సినిమాకు అనుష్కను అనుకోగా మీ సినిమాలతో బిజీగా ఉంది. మరి కరీనా విషయానికొస్తే.. ఆమె డేట్స్ కూడా ఖాళీ లేవని అర్థమవుతుంది..ఇద్దరు ఆ పాత్రకు కరెక్టుగా షూట్ అవుతారు. 



చాలా కాలం తర్వాత వస్తున్న ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఆ సినిమా గురించి ఇంగ్లిష్ పత్రికల్లో మాత్రమే రూపొందిస్తున్నారనే వార్తలు భారీగా వినపడుతున్నాయి. బాలీవుడ్ సినిమా వర్గాల నుండి అధికారక ప్రకటన వెలువడలేదు. ఎప్పుడు సినిమా మొదలవుతుందో చూడాలి.. ఆ సినిమా తెలుగు అరుంధతిని మించి ఉంటుందో లేదా తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: