మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కాబోతుంది. సైరా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రామ్ చరణ్ ఈ మధ్య కాలంలో ఒక సినిమా ఎమోషనల్ గా కంటతడి పెట్టించిందని చెప్పాడు. విజయ్ సేతుపతి, త్రిష తమిళంలో నటించిన 96 మూవీ గురించి రామ్ చరణ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విజయ్ సేతుపతి సైరా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 
గత సంవత్సరం విడుదలైన 96 సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఆ తరువాత ఈ సినిమాను కన్నడ భాషలో కూడా రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా రీమేక్  అవుతోంది. తెలుగులో శర్వానంద్, సమంత జంటగా దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. 96 సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ సినిమాను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని మరియు 96 సినిమాలో విజయ్ సేతుపతి నటన ఎంతో ఆకట్టుకుందని చెప్పారు. 
 
విజయ్ సేతుపతిని తొలిసారి కలిసిన సమయంలో నిమిషం పాటు హత్తుకుని అభినందనలు చెప్పానని రామ్ చరణ్ చెప్పాడు. మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న సైరా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా 200 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది. 
 
ఈ సినిమా సౌత్ ఇండియా శాటిలైట్ రైట్స్ సన్ నెట్ వర్క్ దక్కించుకోగా డిజిటల్ రైట్స్ అన్ని భాషల్లో అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని సమాచారం. ఇప్పటికే సైరా సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. మొదటి రోజు ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమా తెరకెక్కింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: