ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొద్దికాలంగా కిడ్నీల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్, కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే ఒక వారం క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆయనను అదే ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అయితే డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ వేణుమాధవ్ ఆరోగ్యం కుదుటపడక చివరకు మృత్యువు ఒడిలోకి చేరారు. 

ఇక ఆయన మృతితో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఆయన మరణించిన తరువాత ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి పలువురు చిత్ర రంగ ప్రముఖులు వచ్చినప్పటికీ, హాస్య బ్రహ్మ, బ్రహ్మానందం మాత్రం హాజరు కాలేదు. అయితే ఆయన ఎందుకు రాలేదు అనే విషయమై పలువురు సందేహం వ్యక్తం చేస్తుండగా, నేడు ఫిలిం నగర్ వర్గాల్లో ఆ విషయమై ఒక వార్త బయటకు వచ్చింది. కొన్నాళ్ల క్రితం హార్ట్ సర్జరీ చేయించుకున్న బ్రహ్మానందం గారు, చాలావరకు తన ఇంటికే పరిమితం అవడం జరిగింది. ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాలో కేవలం ఒక్క నిమిషం నిడివి ఉన్న చిన్న పాత్రలో మాత్రమే నటించిన బ్రహ్మానందం గారు, 

సడన్ గా వేణుమాధవ్ మరణవార్త తెలియగానే కొంత ఢీలాపడ్డారట. తనకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తుల్లో వేణుమాధవ్ ఒకరని, అతడు ఇలా అర్ధాంతరంగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధను కలిగిస్తుందని బ్రహ్మానందం గారు ఎంతో బాధ పడ్డట్లు సమాచారం. అయితే తన ఆరోగ్యం సరిగా లేని కారణంగానే వేణుమాధవ్ ని కడసారి చూపు చూడడానికి ఆయన రాలేకపోయినట్లు చెప్తున్నారు. ఇటీవల వరుసగా మన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన కమెడియన్లు ఒకరి వెంట మరొక వెళ్లిపోవడం నిజంగా ఎంతో కలచి వేసే విషయమని అంటున్నారు పలువురు విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: