‘సైరా’ విడుదలకు ఇక మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ మూవీ ప్రమోషన్  తార స్థాయికి చేరుకుంది. బాలీవుడ్ తో పాటు పక్క రాష్ట్రాలకు కూడ వెళ్లి సైరా టీమ్ హడావిడి చేస్తోంది. ఈ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేస్తూ చిరంజీవి అన్ని భాషలకు సంబంధించిన మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.   

అయితే ఈ మీడియా మీట్ లో ఎక్కడా దర్శకుడు సురేంద్ర రెడ్డి కానీ కనిపించక పోవడంతో అతడిని ‘సైరా’ నిర్మాతలు ప్రచారానికి పిలవలేదో లేదా కావాలనే పక్కన పెట్టేసారా అంటూ పర భాష  మీడియా వర్గాలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నాయి.  మొట్టమొదట ముంబైలో జరిగిన  ‘సైరా’ హిందీ టీజర్ లాంచ్ టైమ్ లో మాత్రమే సురేందర్ రెడ్డి చిరంజీవి రామ్ చరణ్ తో కలిసి కనిపించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తప్పించి మరి ఎక్కడా ప్రస్తుతం సురేంద్ర రెడ్డ్డి కనిపించడం లేదు. 

రామ్ చరణ్  చిరంజీవి కలసి బాలీవుడ్ ప్రచారాన్నిముందుకు నడిపిస్తున్నారు. ఆఖరికి నిన్న బెంగుళూరులో జరిగిన ‘సైరా’ ప్రమోషన్ కార్యక్రమంలో కూడ సురేంద్ర రెడ్డ్డి కనిపించలేదు. దీనితో సురేంద్ర రెడ్డి ఏమయ్యాడు అంటూ వివిధ పర భాష మీడియా సంస్థలు కామెంట్స్ చేస్తున్నాయి.    

సురేంద్ర రెడ్డికి జాతీయ స్థాయిలో పాపులారిటీ లేదు కాబట్టి ఇలా వ్యవహరిస్తున్నారా లేదంటే ఈ విషయం వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.  తెలుస్తున్న సమాచారం మేరకు సురేంద్ర రెడ్డిని ఈ మూవీ రిలీజ్ కు సంబంధించిన వ్యవహారాలు తెలుగు మీడియా ప్రమోషన్ వరకు మాత్రమే పరిమతం చేసారని తెలుస్తోంది. దీనితో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ క్రెడిట్ చిరంజీవి చరణ్ ల ఖాతాలోకి ఫెయిల్ అయితే ఆ ఫలితం సురేంద్ర రెడ్డి ఖాతాలోకి వెళ్ళే విధంగా రంగం సిద్ధం అయిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: