బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కి గడ్డు కాలం నడుస్తుందనే చెప్పాలి. గత కొంత కాలంగా షారుక్ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడుతున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన   జీరో సినిమా అందరిని నిరాశపరిచింది  జీరో సినిమా వచ్చి దాదాపుగా 10 నెలలు అవుతున్న సరే  షారుక్ నెక్స్ట్ మూవీ  గురించి ఏలాంటి అనౌన్స్ మెంట్ చేయలేదు.  షారుక్ తరువాతి సినిమా  కోసం ఆయన అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు 
.
రీసెంట్ గా ముంబాయి ఫిల్మిం సర్కిల్ నుండి  ఒక హాట్ న్యూస్ బయటకు వచ్చింది.ప్రముఖ హలీవుడ్ దర్శకుడు క్వింటెన్ టారంటినో తెరకెక్కించిన "కిల్ బిల్" సినిమా  హిందీ రీమేక్ రైట్స్ ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమాలో విలన్ పాత్రకు కోసం చాలా మంది నటులను అనుకున్నరట కానీ అందరి కన్నా షారుక్ ఖాన్ అయితే బాగా సెట్ అవుతాడని నిర్మాతలు భావిస్తున్నారట .ఈ సినిమా స్క్రిప్ట్ ని హిందీ ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేస్తున్నారట . షారుక్ ఖాన్ డర్ర్, బాజీగర్ సినిమాల్లో  నెగిటివ్ పాత్రలో కనిపించి అందరిని మెప్పించాడు.ఈ సినిమాకి అనురాగ్ కశ్యప్  దర్శకత్వం వహిస్తాడని రూమర్స్ వస్తున్నాయి .ఈ పాత్రను షారుక్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.


కిల్ బిల్ సినిమా హలీవుడ్ లో చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. ఆ సినిమాలో ఫైట్స్ కి అందరు ఫిదా అయ్యారు.ఈ విషయాలపై అధికారిక ప్రకటన చేయలేదు .షారుక్ ఖాన్ ప్రస్తుతం కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు . రీసెంట్ గా జాన్ అబ్రహమ్ హీరోగా నటించిన బద్లా సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు.అలాగే ఇమ్రాన్ హష్మి , శోభిత ధూళిపాల  ప్రధాన పాత్రల్లో నటించిన  "బార్డ్ ఆఫ్ బ్లడ్" వెబ్ సిరీస్ ని నిర్మించాడు.ఈ వెబ్ సిరీస్ అందరిని ఆకట్టుకుంటుంది 
 


మరింత సమాచారం తెలుసుకోండి: