టాలీవుడ్ క్రేజీ యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. విజయ్ సరసన నలుగురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ ఒక రొమాంటిక్ లవర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూస్తుంటే కొంతవరకు అది కరెక్టే అని అనిపిస్తోంది. 

ఇకపోతే దీని తోపాటు ఆయన నటిస్తున్న మరొక సినిమా తమిళ దర్శకుడు అన్నామలై దర్శకత్వంలో రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని, త్వరలో రెండవ షెడ్యూల్ ని జరుపుకోబోతోంది. ఇకపోతే వీటితో పాటు ఇటీవల పూరితో ఒక సినిమాకి సైన్ చేసిన విజయ్, తొలిసారి తన కెరీర్ లో ఇప్పటివరకు చేయని ఒక మాస్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు రాగా, ఈ సినిమాలో విజయ్ ఒక యంగ్ ఫైటర్ రోల్ లో నటిస్తున్నాడట. తన లైఫ్ లో ప్రతిదీ ఒక ఛాలెంజ్ లా తీసుకునే హీరో, 

అనుకోకుండా తన జీవితంలో ఎదురైన ఒక సమస్య పై, అలానే దాని వెనకున్న వారి పై ఫైటర్ లా ఎలా పోరాడాడు అనేది ఈ సినిమా కథాంశమని సమాచారం. మరోవైపు హీరోలను తనదైన మాస్ స్టైల్ లో చూపించి ఆకట్టుకునే పూరి, ఈ సినిమాలో ఎంతో పవర్ ఫుల్ గా విజయ్ పాత్రను రాసుకున్నట్లు చెప్తున్నారు. అలానే పేరుకు తగ్గట్లు సినిమాలో మంచి యాక్షన్ సీన్స్, ఫైట్స్ అదిరిపోతాయాని చెప్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్న ఈ వార్తలో పూర్తి నిజానిజాలు తెలియనప్పటికీ, ఇదే కనుక ఒకవేళ నిజం అయితే మాత్రం, రౌడీ హీరో ఫ్యాన్స్ కు ఇది నిజంగా పండుగ వార్తే అంటున్నారు సినీ విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: