మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమా అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మించాడు. సినిమాకు బడ్జెట్ 270 కోట్ల దాకా అయ్యిందని తెలుస్తుంది.


అయితే ఎవరైనా బడ్జెట్ అయినదాని కన్నా డబుల్ గా సినిమాను అమ్మేస్తారు. కాని నిర్మాత రాం చరణ్ అలా చేస్తే ఒకవేళ సినిమా తేడా కొడితే డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బంది పడతారని భావించి సైరాని తక్కువ రేటుకే అమ్మేశాడు. వరల్డ్ వైడ్ గా సైరా సినిమా 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అవుతుంది.


నైజాం 30 కోట్లు బిజినెస్ చేయగా.. సీడెడ్ 22 కోట్లకు కొనేశారు.. ఈస్ట్ 10.40 కోట్లు బిజినెస్ చేయగా.. వెస్ట్ 9.20 కోట్లు చేసింది. నెల్లూరులో 5.20 కోట్లకు సైరా అమ్ముడైంది.. ఇక కృష్ణా 9.60 కోట్లు, గుంటూరు 11.50 కోట్లు బిజినెస్ చేయగా.. వైజాగ్ లో14.40 కోట్లకు అమ్ముడయ్యింది. ఏపి తెలంగాణా తెలుగు రెండు రాష్ట్రాల్లో సైరా 112.30 కోట్లు బిజినెస్ చేసింది. ఇక ఇదే కాకుండా కర్ణాటక 28 కోట్లు, తమిళనాడు 7.50 కోట్లు, కేరళ 2.50 కోట్ల బిజినెస్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా 27.50 కోట్ల బిజినెస్ సాగింది. ఓవర్సీస్ లో కూడా సైరాకి మంచి రేటు పలికింది.. ఓవర్సీస్ లో సైరా 20కోట్ల బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా 200 కోట్ల బిజినెస్ తో సైరా సంచలనం సృష్టిస్తుంది.  


అయితే సైరా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కు మరో 100 కోట్లు అనగా 300 కోట్లు ఆపైన కలక్షన్స్ తెస్తే మాత్రం సైరా సెన్సేషనల్ హిట్ అన్నట్టే లెక్క. తెలుగు రెండు రాష్ట్రాల్లో సైరాపై బజ్ బాగానే ఉన్నా బాలీవుడ్ లో ఈ సినిమాకు పోటీగా హృతిక్ రోషన్ వార్ సినిమా వస్తుండటంతో అక్కడ కాస్త అంచనాలకు తగినట్టుగా వసూళ్లు ఉంటాయో లేదో అని డౌట్ పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: