యంగ్ హీరో నిఖిల్ కి బాగానే హిట్లు వచ్చాయి. నిజానికి నిఖిల్ కి వచ్చిన సక్సెస్ స్థాయికి.. నిఖిల్ వరుస సినిమాల రిలీజ్ లతో బిజీ బిజీగా ఉండాలి. కానీ ఒక్క హిట్ కూడా లేని హీరో సినిమాల లాగా  నిఖిల్ సినిమాలు తయారవుతున్నాయి.  టాలీవుడ్ లో ఇప్పుడంతా యంగ్ హీరోలదే హవా. కానీ ఆ హవాలో హడావుడి చెయ్యాల్సిన నిఖిల్.. అసలు ఏ మాత్రం తన ఉనికిని చాటుకోలేకపోతున్నాడు.  ప్రస్తుత విషయంలోకి వెళ్తే.. నిఖిల్ నటించిన కొత్త చిత్రం 'అర్జున్ సురవరం'.    నూతన దర్శకుడు టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో   యువ హీరో నిఖిల్ హీరోగా  లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా  ఎప్పుడో విడుదల కావాల్సిన చిత్రం ఎట్టకేలకూ విడుదలకు సిద్ధం అయింది.   సినిమాకు కొత్త రిలీజ్ డేట్ దొరికింది. అక్టోబర్ 5న లేదా 8న సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా ప్రకటించాడు.  అంతేకాదు ఇన్నాళ్లు మిమల్ని వెయిట్ చేయించానని తెలుసు.. ఓపికగా ఎదురుచూసినందుకు థాంక్స్ అంటూ అభిమానుల్ని ఉద్దేశించి అన్నారు.  మరి ఆ కొత్త రిలీజ్ డేట్ అధికారికంగా  ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.   ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయకిగా నటించింది.  టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు. 


 ఆయితే  నిఖిల్ కి  ఈ మధ్య అసలు టైం కలిసిరావడం లేదు. ఒక పక్క తోటి హీరోలు వరుస సక్సెస్ లతో ఊపు మీద ఉంటే.. నిఖిల్ మాత్రం చేసిన సినిమాని కూడా రిలీజ్ చేసుకోలేక బాక్సాఫీస్ వద్ద  వెనుకబడిపోతున్నాడు.  గత సంవత్సరమే రిలీజ్ అవ్వాల్సిన 'అర్జున్ సురవరం'   ఆ తర్వాత మే 1న సినిమా వస్తుందన్నారు. చివరికి  అది వాయిదాపడింది.  ఆ తరవాత కూడా పలుసార్లు తేదీని మార్చారు.   కానీ ఇప్పటికీ  ఈ సినిమాకి  కష్టాలు తొలిగాయి.  ఏమైనా మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే  నిఖిల్ సినిమా రిలీజ్ ఇంత ఆలస్యం అవడం  నిజంగా  ఆశ్చర్యకరమే. నిజానికి నిఖిల్ కి బాగానే హిట్లు వచ్చాయి. నిఖిల్ కి వచ్చిన సక్సెస్ స్థాయికి.. నిఖిల్ వరుస సినిమాల రిలీజ్ లతో బిజీ బిజీగా ఉండాలి. కానీ ఒక్క హిట్ కూడా లేని హీరో సినిమాల లాగా  నిఖిల్ సినిమాలు తయారవుతున్నాయి.  టాలీవుడ్ లో ఇప్పుడంతా యంగ్ హీరోలదే హవా. కానీ ఆ హవాలో హడావుడి చెయ్యాల్సిన నిఖిల్.. అసలు ఏ మాత్రం తన ఉనికిని చాటుకోలేకపోతున్నాడు.  ప్రస్తుతం నిఖిల్  దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ - 2 ' సినిమాను   చేయడానికి ప్రస్తుతం నిఖిల్ ప్లాన్ చేస్తున్నాడు.  ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ రెండో వారం నుండి మొదలెట్టనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: