బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు వచ్చింది. మరో నాలుగు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 3 ముగుస్తుంది. ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ చాలామంది ఉన్నారు. సీజన్ 2లో లాగా ఒకరి మీదే ఆట నడవలేదు. బిగ్ బాస్ సీజన్ 2 నెల రోజుల ముందు నుండే కౌశల్ విన్నర్ అని ప్రచారం మొదలైంది. అయితే ఈ సీజన్ లో అలా చెప్పడానికి వీలు లేకుండాపోయింది.


అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యే విధానాన్ని బట్టి సీజన్ విన్నర్ ను డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఈ వారం నామినేషన్స్ లో శ్రీముఖి, బాబా భాస్కర్, రవి కృష్ణ, వరుణ్ సందేష్ ఉన్నారు. ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్ లో వరుణ్ సేఫ్ అయ్యాడు. ఇక బాబా, శ్రీముఖి, రవి కృష్ణలలో ఒకరు ఎలిమినేట్ అవుతారు.


అందిన సమాచారం ప్రకారం ఈ వారం రవి కృష్ణ ఎలిమినేట్ అయినట్టుగా చెబుతున్నారు. ఇక మిగిలిన వారిలో స్ట్రాంగ్ గా ఫైనల్స్ కు వెళ్లే వారిలో వరుణ్, రాహుల్, శ్రీముఖి, శివ జ్యోతి ఉండొచ్చని చెప్పొచ్చు. అయితే టాప్ 5 వీరు కాగా టాప్ 3లో మాత్రం వరుణ్, శ్రీముఖి, రాహుల్ ఉండే అవకాశం ఉందట. 


ఈ ముగ్గురిలోనే సీజన్ 3 విన్నర్ ఉండొచ్చని అంటున్నారు. ఇక వీరిలో కూడా వరుణ్ సందేష్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అవసరమైనప్పుడు కోపంగా మిగిలిన టైంలో ఇంటి సభ్యులందరితో మంచిగా ప్రవర్తిస్తున్న వరుణ్ కే టైటిల్ కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు. అయితే ఇది బిగ్ బాస్ హౌజ్ కాబట్టి చివరి దాకా ఎలాంటి మ్యాజిక్ అయినా జరగొచ్చు. మరి నిజంగానే వరుణ్ విన్నర్ అవుతాడా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: