ప్రముఖ బాలీవుడ్ నటీ కంగానా రనౌత్  మనసులో ఏం అనుకుంటుందో అదే  మొహం పై చేబుతుంది. అందువల్ల సినిమాల తో వచ్చిన పబ్లిసిటీ కంటే వివాదాల వల్ల వచ్చిన పబ్లిసిటీ యే ఎక్కువ.  హృతిక్ రోషన్ మరియు కంగనాల మధ్య  గత కొన్ని సంవత్సరాలుగా  వివాదాలు  చెలరేగుతున్నాయి. వీరిద్దరూ కలిసి క్రిష్ 3 సినిమాలో  నటించారు. ఆ సమయంలో హృతిక్ రోషన్ నేను  ప్రేమించుకున్నాం అని చెప్పడంతో ఈ వివాదం మొదలైంది. హృతిక్ రోషన్ ఈ మొత్తం వ్యవహారాన్ని ఖండించాడు.ఈ వివాదం అనేక మలుపులు తిరిగి ఈ మధ్య కొంచెం సద్దుమణిగింది.

కంగానా  రనౌత్ తనకు ఇష్టం వచ్చినప్పుడు ఈ వివాదాన్ని తెరపైకి లాగింది.రీసెంట్ గా ఒక  ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు..మీరు ఉదయాన్నే లేవగానే హృతిక్ రోషన్ లాగా మారిపోతే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు ఆవిడ  వెంటనే కంగనా రనౌత్ కి ఫోన్ చేసి క్షమాపణలు చెబుతాను అని చెప్పింది.దీంతో కంగనా హృతిక్ నుండి ఇంకా క్షమాపణలు ఆశిస్తుందని అర్థం అవుతుంది.

  ఉదయాన్నే లేవగానే సల్మాన్ ఖాన్ లాగా మారిపోతే ఏం చేస్తారు అన్న ప్రశ్నకి మీడియా వారి చెవులు పిండుతాను అని చెప్పింది. ఎందుకంటే నేను ఏదైనా విషయం పైన  మాట్లాడితే నా మీద ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అదే సల్మాన్ మాట్లాడితే మాత్రం సైలెంట్ గా ఉంటారు అని చెప్పింది. 
ఈ కార్యక్రమంలో ఇండియాలోని కొన్ని సమస్యల పైన ఆమె తన అభిప్రాయాలను వెల్లడించింది. 


ప్రస్తుతం కంగనా  తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో  'తలైవి' సినిమా లో  నటిస్తుంది.ఇందులో  దివంగత ముఖ్యమంత్రి  జయలలిత పాత్రలో  కంగనా  కనిపించనుంది..తలైవి సినిమా మేకప్ కోసం కెప్టెన్‌ మర్వెల్, హంగర్‌ గేమ్స్‌, బ్లేడ్‌ రన్నర్  సినిమాలకు పని చేసిన జసన్ కాలిన్స్  పని చేస్తున్నారు.ఈ సినిమా లో కంగనా నాలుగు గెటప్స్ లో కనబడనుంది. ఈ సినిమా  షూటింగ్ దీపావళి తరువాత మొదలవుతుంది


మరింత సమాచారం తెలుసుకోండి: