తెలుగులో  మాస్ సినిమాలు తీయడంలో కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఈయన సినిమాల కోసం యూత్ ఎదురు చూస్తుంటారు. అలాంటి పూరికి గత కొంతకాలం కింద నుండి సక్సెస్ అనేది అందని ద్రాక్షలా మారింది. మొన్న వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరిని మళ్ళీ డైరెక్టర్ గా నిలబెట్టింది. విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయబోతున్నాడు..




ఇకపోతే పూరి కొడుకు ఆకాష్ పూరి ఆంధ్రపోరి సినిమాతో హీరోగా అరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే.. ఆ సినిమాను పూరి దగ్గరుండి చూసుకున్న కూడా హిట్ కాలేదు. మరో సినిమాగా మెహబూబా సినిమా కూడా వచ్చింది ఆ సినిమా కూడా ఆకాష్ కు మంచి సక్సెస్ ను అందించలేదు. దానితో ఎందరికో లైఫ్ ను ఇచ్చిన పూరి కొడుకు కు సక్సెస్ ఇవ్వలేకపోయాడు అనే మాటలను మూట కట్టుకున్నాడు.




ఆ విషయంలో సీరియస్ అయినా పూరి కొడుకు సినిమాకు ఆయనే దగ్గరుండి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం భాద్యతలు చేపట్టారు. ఆ సినిమాను పూరి జగన్నాథ్,చార్మింగ్ ఛార్మి కలిసి  సొంత బ్యానర్పై నిర్మిస్తున్నారు.





అయితే ఈ సినిమా ఫ్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తానని చిత్ర యూనిట్ వెల్లడించారు. రేపు ఉదయం 11  గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ఆకాష్ హీరోగా నటించగా.. కేతికా వర్మ హీరోయిన్.. అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. లావణ్య ఈ సినిమాను సమర్పించారు. టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి , చార్మింగ్ ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. పోస్టర్ లుక్ ఇంత రొమాంటిక్ గా ఉంటె మరి సినిమాలో ఎంత రొమాన్స్ ఉంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: