ఇటీవల టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో కొందరు మేనేజర్లు మరియు సినిమా కో ఆర్డినేటర్లు, అవకాశాల కోసం ఇక్కడకు వచ్చే అమ్మాయిలను పలు విధాలుగా లైంగికంగా వేధింపులకు పాల్పడుతూ హింసిస్తున్నారని వర్ధమాన నటి శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో అతి పెద్ద సంచనలనాన్ని రేకెత్తించిన ఆ వివాదం, ఆ తరువాత కొంత కాలానికి సర్దుకుంది. 

అనంతరం కొందరు సినిమా సెలెబ్రిటీలు తమ కోరిక తీరిస్తే నీకు సినిమా అవకాశం ఇస్తామని తనను లైంగికంగా వాడుకున్నారని ఒక బడా నిర్మాత తనయుడితో కలిసి దిగిన ఫోటోలు బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీరెడ్డి, ఆ తరువాత మరి కొందరు సెలెబ్రిటీల పేర్లు కూడా బయట పెట్టింది. ఇక ఆ తరువాత పూర్తిగా తన మకాంని చెన్నైకి మార్చిన శ్రీరెడ్డి, తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా మాత్రం ఎప్పటికపుడు కొందరు సినిమా సెలెబ్రిటీల పై సెటైర్లు ఇప్పటికీ వేస్తూనే ఉంది. ఇక కొన్నాళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పరుష వ్యాఖ్యలు చేసి, ఆయన అభిమానుల ఆగ్రహావేశాలకు గురైన శ్రీరెడ్డి, 

నిన్న తన ఫేస్ బుక్ లో పవన్ పై జూకుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఇటీవల తనకు వెన్ను నొప్పి తీవ్రమవడంతో ప్రస్తుతం ఇంటివద్దనే రెస్ట్ తీసుకుంటూ త్వరలో ఆపరేషన్ కు ఉపక్రమిస్తున్న పవన్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యానిస్తూ, 'పవన్ కి వెన్నుపూస గాయాలంట కదా, పాపం అది పని చేస్తుందో లేదో, ఇప్పటికే చాలా వాడేసాడు, అరిగిపోయిందో ఏమో' అంటూ ఘోరమైన వ్యాఖ్యలు చేసింది. అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కొందరు పవన్ ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆమెకు మెసేజెస్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: