నిత్యం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పిల్ల‌లు సెక్స్ కోరుకుంటే.. వారిని త‌ల్లిదండ్రులు ప్రోత్స‌హించాల‌ని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో జ‌రిగిన ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 స‌ద‌స్సులో పాల్గొన్న కంగ‌నా సెక్స్ గురించి త‌న అభిప్రాయం వెల్ల‌డించింది. ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో సెక్స్ అనేది చాలా ముఖ్య‌మ‌ని ఈ విష‌యంలో ఎలాంటి మొహ‌మాటం ప‌డ‌వ‌ద్ద‌ని సూచించింది.
తన ఫస్ట్ క్రష్ గురించి.. తన ఫస్ట్ రిలేషన్‌షిప్ గురించి కూడా ఆమె వివరించారు. సంప్రదాయాలు శృంగారాన్ని అనుమతించదని తెలుసు అంటూనే సెక్స్ పై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టింది.


 ప్రతీ ఒక్కరి జీవితంలో సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సెక్స్ కోరకుంటే.. ఎలాంటి మొహమాటం లేకుండా ఆ  పని చేసేయండి అంటూ చెప్పింది. అంతేకాదు మనసులో కోరిక పెట్టుకొని దాని కోసం వేచి చూడకండి అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చింది. సంప్రదాయాలు శృంగారాన్ని అనుమతించదని తెలుసు అంటూనే సెక్స్ పై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టింది.


ఇటీవల క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రంలో నటించారు. అయితే సినిమాకు తానే పూర్తిగా దర్శకత్వం బాధ్యతలు వహించానని, అయితే క్రిష్‌కు డైరెక్షన్ విషయంలో ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారాయి. అంతేకాకుండా క్రిష్‌పై పలు ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.
ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి, దివంగత నేత జే జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న తలైవి అనే బయోపిక్‌లో కంగన నటిస్తున్నది. ప్రముఖ మాటల రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: