మన ఇండియాలో సెక్స్ ను నాలుగు గోడల మధ్య వ్యవహారంగానే చూస్తారు. అందులోనూ మన సంస్కృతి కట్టుబాట్ల కారణంగా.. సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడటం చాలా అరుదు. ఇప్పుడిప్పుడే సినిమాల పుణ్యమా అని సెక్స్ విషయాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అందుకే సినిమాలు పిల్లలను చెడగొడుతున్నాయని కొందరు అంటుంటారు.


ఈ నేపథ్యంలో నిత్యం వివాదస్పద వ్యాఖ్యలు చేసే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. పిల్లలు సెక్స్ కోరుకుంటే.. వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలనివ్యాఖ్యానించింది. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 సదస్సులో పాల్గొన్న కంగనా సెక్స్ గురించి తన అభిప్రాయం వెల్లడించింది. ప్రతీ ఒక్కరి జీవితంలో సెక్స్ అనేదిచాలా ముఖ్యమని ఈ విషయంలో ఎలాంటి మొహమాటం పడవద్దని సూచించింది.


మనసులో కోరిక పెట్టుకొని దాని కోసం వేచి చూడకండి అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చింది. సంప్రదాయాలు శృంగారాన్ని అనుమతించదని తెలుసు అంటూనే సెక్స్ పై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టింది. ఒకప్పుడు కేవలం శృంగారం కోసమే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనికి కట్టుబడి ఉండాలని చెప్పేవారు. చరిత్రలో చోటుచేసుకున్న దండయాత్రల కారణంగా ఇప్పటికీ మన ఆలోచనలు అక్కడే ఉన్నాయి.


మన పవిత్ర గ్రంథాలు కూడా శృంగారాన్ని అనుమతించవు. కానీ పిల్లలు శృంగారంలో పాల్గొనడంపట్ల తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి. పిల్లలు కూడా శృంగారం విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నేను శృంగారపరంగా యాక్టివ్‌గా ఉన్నానని తెలుసుకొని నా తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.నన్ను కోప్పడ్డారు కూడా.

పిల్లలు శృంగారంలో పాల్గొనేలా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలని కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో కంగనా.. తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసింది. తానే హృతిక్ రోషన్ అయితే కంగనాకు ఫోన్ చేసి క్షమాపణలు చెబుతాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తన ఫస్ట్ క్రష్ గురించి.. తన ఫస్ట్ రిలేషన్‌షిప్ గురించి కూడా ఆమె వివరించింది. సంప్రదాయాలు శృంగారాన్ని అనుమతించదని తెలుసు అంటూనే సెక్స్ పై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: