యాక్షన్ హీరో గోపీచంద్- మెహ్రిన్ జంటగా నటించిన "చాణిక్య" సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 5న విడుదలకు సిద్ధం అవుతుంది.ఈ సినిమాలో  గోపీచంద్  సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నాడు.యాక్షన్ ఎంటర్టైనర్ గా చాణిక్య తెరకెక్కుతోంది.. సినిమాలోని ఎక్కువ  భాగం లడక్, రాజస్థాన్ లో చిత్రికరించారు. ఈ సినిమా కోసం చాలా ప్రమాదకరమైన యాక్షన్ సీక్వెన్స్ లు గోపీచంద్ చేశారు. అయితే చిత్రీకరణ సమయంలో  గోపీచంద్ కి చాలా పెద్ద ప్రమాదం జరిగింది.


చాణిక్య సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్  లని రాజస్థాన్ లో షూట్ చేశారు.  బైక్ ఛేజ్ సీన్ తీస్తున్న సమయంలో,  బైక్ కండిషన్ సరిగా లేకపోవడంతో యాక్సిడెంట్ అయ్యింది. తన ముందు ఉన్న కెమెరాల్ని కాపాడబోయి  ఆయన గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన నరాలు కట్ అవడం తో తీవ్ర రక్తస్రావం జరిగింది.  ఈ సంఘటన  స్థలం నుండి   జైపూర్ కి  వెళ్ళే సరికి మూడు గంటల సమయం పట్టింది. అంత సేపు గోపీచంద్  రక్తం కారుతునే ఉందంట.ఆ గాయాల నుండి కోలుకోవడానికి ఆయనకు దాదాపు  నెల రోజులు పట్టింది.


బాలీవుడ్ అందాల నటీ జరీన్ ఖాన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.  తమిళ దర్శకుడు తిరు  దర్శకత్వం వహిస్తున్న చాణిక్య  సినిమాకి విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు. చాణిక్య సినిమా గోపీ చంద్ కెరియర్ లోనే  హై బడ్జెట్ సినిమా.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్  మరియు ట్రైలర్ లు సినిమా పై అంచనాలను బాగా పెంచాయి. సైరా కు పోటీ గా ఈ సినిమా ని రిలీజ్ చేస్తున్నారు. పండుగ సీజన్ కాబట్టి రెండు సినిమాలకు  మంచి ఓపెనింగ్స్ దొరుకుతాయని సినీ పండితులు చెబుతున్నారు.  చాలా కాలంగా సక్సెస్ కోసం చూస్తున్న గోపీచంద్ కి చాణిక్య సినిమా అయినా విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: