బిగ్ బాస్ సీజన్ 3, 10 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా అనుకున్న వారు కూడా అనివార్యకారణాల వల్ల హౌజ్ నుండి బయటకు వస్తున్నారు. ఈ వారం రవి కృష్ణ ఎలిమినేషన్ అందరిని షాక్ అయ్యేలా చేసింది. సీరియల్స్ లో క్రేజీ యాక్టర్ అయిన రవి కృష్ణ బిగ్ బాస్ కు రావడం మంచోడని పేరు తెచ్చుకోవడం విశేషం. 


అయితే ఈ షోలో కావాల్సింది మంచోడని అనిపించుకోవడం కాదు పోకిరిగా ఉండటమే. అందుకే మంచోడు మంచోడు అంటూ రవి కృష్ణను ముంచేశారు. 10 వారాల్లో రవి కృష్ణ వల్ల ఎలాంటి గొడవ జరుగలేదు. రవి కృష్ణ కూడా ఎవరి మీద గొడవపడలేదు. తమన్నా సిం హాద్రి తన మీద చేస్తున్న కామెంట్స్ కు సైలెంట్ ఉన్నాడే తప్ప నోరు విప్పలేదు.


అయితే రవి కృష్ణకు మంచి ఇమేజ్ వచ్చినా కొన్ని సమయాల్లో ఆయన సైలెంట్ గా ఉండటమే ఆయన ఎలిమినేట్ అయ్యేలా చేసిందని అంటున్నారు. ఇంట్లో అతను ఉన్నాడా లేడా అన్నది తెలియాలి. తప్పు ఒప్పులను సమీక్షించాలి ఆ విషయంలో రవి కృష్ణ ఎప్పుడూ వెనుకడుగు వేస్తూ వచ్చాడు. అందుకే ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. సర్ ప్రైజ్ ఏంటంటే అలి రెజా హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం.. రవి కృష్ణ హౌజ్ లో నుండి ఎలిమినేట్ అవడం జరిగింది.


వెళ్తూ వెళ్తూ స్టెజ్ మీద నాగార్జునతో కూడా కొన్ని విషయాలను షేర్ చేసుకున్న రవి కృష్ణ ఇకనుండి తనకు కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుందని అన్నాడు. అంతేకాదు నాగార్జున కాళ్లకు నమస్కరించి వెళ్లాడు. రవి కృష్ణ మంచోడు అనడానికి ఇంత మంచి ఉదహరణ ఇంకేముంటుంది చెప్పండి. రవి కృష్ణ హోస్ట్ నాగార్జునని మాత్రమే కాదు సీనియర్ స్టార్ అయిన నాగార్జునని చూశాడు. అందుకే అతని కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నాడు. బిగ్ బాస్ లో ఇలాని మంచి వాళ్లకు చోటు ఉండదని ఆడియెన్స్ భలే షాక్ ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: