తెలుగు చిత్ర పరిశ్రమలో స్టయిలిష్ స్టార్ బన్నీ ఏంచేసినా కూడా అందులో ఆయన స్టైల్, మాస్ అన్ని ఉండటం వల్ల సినిమా హిట్ అవుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంటర్ అయినా బన్నీ ఎన్నో సినిమాలలో నటించారు. అందులో కొన్ని సినిమాలు  డిజాస్టర్స్ గా మిగిలాయి. ఏది ఏమైనా కూడా బన్నీ కృంగిపోకుండా మళ్ళీ వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత దాపుగా ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ క్రేజీ కొంబోలో సినిమా చేస్తున్నాడు. 



మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో గతంలో రెండు సినిమాలు చేసాడు. జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి.. ఈ రెండు సినిమాలు బన్నీకి సక్సెస్ ను అందించాయి. రాబోతున్న మూడో సినిమా కూడా బన్నీకి హిట్ ఇస్తుందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది. ఆ సినిమానే అల వైకుంఠపురములో ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. 



తాజాగా ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన సామజవరాగమనా అనే పాటను రిలీజ్ చేశారు ఆ చిత్ర యూనిట్.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఆ పాట అందరిని ఆకట్టుకుంది. రిలీజ్ అయినా 96 నిమిషాలకే లక్ష్య వ్యూస్ ను రాబట్టింది. ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ముఫై లక్షల వ్యూస్ తో దూసుకుపోయి అందరిని షాక్ కి గురిచేసింది. 



ఇకపోతే ఈ సినిమాలో బన్నీ సరసన రెండో సారి జతకడుతుంది పూజాహెగ్డే. సీనియర్ నటులు ఇందులో నటిస్తున్నారు. రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. సాంగ్ ఇంతగా హిట్ అయ్యింది. అది కూడా ఒక్క సాంగ్ మాత్రమే. త్రివిక్రమ్ మరి ఇలాంటి పాటలను ఇంకా సినిమాలో ఉంచేవుంటాడు. గ్యారెంటీ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. చూడాలి సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: