మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా చిత్రం పైన పలు వివాదాలు తెరలేచిన విషయం తెలిసిందే.  తొలి స్వతంత్ర సమరయోధుడు గా ఎక్కడో మరుగున పడిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథను సైరా గా ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఉన్న సమస్య ఉయ్యాలవాడ వారసులు. సినిమాను తెరకెక్కించే సమయం లో తమకు డబ్బు ఇస్తామన్నారని ఉయ్యాలవాడ వారసులు ఆరోపిస్తున్నారు. దాని పై తాజాగా చిరు ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు చాలా అమాయకులు. వారిని ఎవరో కావాలనే  మా మీదకు ఉసిగొల్పి పంపారు. నిజానికి వారి ఊరికి కానీ.. వారికి కానీ ఏదైనా చేద్దామని రామ్ చరణ్ అన్నాడు. వారికి సంబంధించిన ఆర్థిక సాయం విషయాన్ని చూడాలని సినీ ప్రముఖులు ఎన్వీ ప్రసాద్ కు అప్పజెప్పాం. అని అన్నారు. కానీ వాళ్ళు మాత్రం. తాము మొత్తం పాతిక కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి రెండు కోట్లు చొప్పున మొత్తం రూ.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయటం మొదలెట్టారు.  ఎవరి కథ అయినా అది చరిత్రేనని కోర్టు చెప్పింది. చివరకు స్వాతంత్య్ర మరయోథుడు మంగళ్ పాండే సినిమా విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ.. అరవైఏళ్లు దాటితే ఏ చరిత్రకారుడి పైన వారసులకు హక్కు ఉండదని తేల్చింది. ఈ విషయాన్నీ ఉయ్యాలవాడ వారసులు గ్రహించాలి అని అన్నారు. నిజానికి చరిత్రను తెరకెక్కించే సమయం లో కథను వక్రీకరించ వద్దు, నిజాలను చూపించాలి ఇలా కోరుకోవడం సమంజసం కానీ ఇలా డబ్బులు అడగటం మాత్రం సరైన పద్ధతి కాదు అని అన్నారు. 


ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ సెన్సార్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమా అదిరిపోయిందంటూ ఓవర్సీస్ సినీ బిజినెస్ మ్యాన్ ఉమర్ సంధు ట్వీట్ చేశారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను తెరకెక్కించిన ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి లాంటి హేమాహేమీలైన నటులు, నయనతార, తమన్నా లాంటి అందమైన హీరోయిన్లు స్క్రీన్‌ను పంచుకుంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ మీద సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో ఫోర్ స్టార్ ఇవ్వడం ఇక్కడ విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: