తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 3 ఇక ఐదు వారాలు మాత్రమే ఉంది.  ఈ నేపథ్యంలో మొన్నటి ఎపిసోడ్ లో నాగార్జున్ చాలా సీరియస్ గా అందరికీ పేరు పేరున తాము చేసిన తప్పులపై ఫుల్ క్లాస్ పీకాడు.  రాహూల్, వరుణ్ సందేష్ ఈ వారం వచ్చిన టాస్క్ లో గిల్లుకోవడానిలు, గిచ్చుకోవడాలు కావడంతో వారికి డాక్టర్ చెకప్ చేసిన మరి అందరి ముందు రచ్చచేశారు. 

ఆ తర్వాత మీ స్నేహం కేవలం పెదాలపైనేనా..గుండెలోంచి వచ్చింది కాదా అని క్రిటిసైట్ చేశారు. మొత్తానికి వీరిద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు. ఇక బాబా భాస్కర్ ని అయితే ఒక్క ఆట ఆడుకున్నారు.  ఇప్పటికి వరకు జరిగిన బిగ్ బాస్ లో నువ్ కేవలం టేకీటీజీగా తీసుకుంటున్నావని..ప్రతిటాస్క్ లో గేమ్ లో కామెడీ చేస్తూ నవ్విస్తున్నావని..అలా చేస్తే ఆటగాళ్లు ఎలా ఆడగలుగుతారని సీరియస్ అయ్యారు.  ఇక ముసుగు తీసేయ్ అని..ఐదు వారాలే ఉందని, ఇప్పటి నుంచి గేమ్ సీరియస్ గా ఆడాలని సూచించారు.

ఇక ఈ వారం నామినేషన్ అందరూ ఇంట్లో మంచోడు మంచోడు అని తెగ పొగిడేసే మొగిలిరేకుల ఫేమ్ రవికృష్ణ ను ఇంటి నుంచి పంపించారు.  అయితే రవికృష్ణ మొదటి నుంచి ఎవరితోనూ ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా చాలా కూల్ గా టాస్క్ లు, గేమ్స్ ఆడుతూ వచ్చాడు.  ఈ వారం ఎలిమినేషన్ చాలా అనూహ్యంగా జరగడంతో చివరికి శ్రీముఖి,రవికృష్ణ,బాబా భాస్కర్ లు ఎలినిమేషన్ రౌండ్ లోకి వచ్చారు.

నిన్నటి ఎపిసోడ్ లో శ్రీముఖ బొమ్మ అతికించి సేఫ్ అయ్యింది.  తర్వాత రవికృష్ణ, బాబా భాస్కలు ఉండగా నాగార్జున విజయవాడకు ఫైట్ టిక్కెట్ తీసుకొని వచ్చి రవికృష్ణను ఎలిమినేట్ చేశారు. ఈ వారం రవికృష్ణ అనుకుంటే ఎలిమినెట్ అయ్యి పునర్నవి పై బిగ్ బాంబ్ వేశాడు. ఇక హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ బట్టలు మొత్తం పునర్నవి ఉతకలని నాగార్జున టాస్క్ విధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: