సినిమా అంటేనే రంగుల ప్రపంచం... ఇక్కడ టాలెంట్‌ తోపాటు కాసింత అద్భష్టం కూడా కలిసిరావాలి.. లేదంటే ఎంత అందంగా ఉన్నా సినిమా అవకాశాలు రావు.. అందంలో మోస్తారుగా ఉన్నా లక్కీ హ్యాండ్‌ అయితే అగ్ర హీరోయిన్‌ గా ఎదిగిపోవచ్చు. టాలీవుడ్‌ లో హీరోలు ఎప్పుడూ ఎవర్‌ గ్రీన్‌. వారి వయసు పెరుగుతున్నా వారు సినిమాలు చేస్తూనే ఉంటారు. అది మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ కాలం నుంచి నేటి చిరంజీవి, నాగార్జునుల వ‌ర‌కు హీరోల‌కు మాత్రం డిమాండ్ బాగానే ఉంట‌ది.  కానీ హీరోయిన్ల పరిస్థితి అలా కాదు... ఓ పదేళ్లు సినిమాలు చేస్తే రిటైర్‌ అయిపోవాల్సిందే... తెలుగు అగ్ర హీరోలందరితో కలిసి సినిమా చేసిన సిమ్రన్‌ రిటైర్‌ అయిపోయింది... కానీ ఆమెతో ఆడి పాడిన బాలయ్య - చిరు - నాగార్జున -వెంకీలు ఇంకా సినిమాలు చేస్తున్నారు. హీరోలకు హీరోయిన్లకు అదే తేడా... ఒక సినిమాతో వెలుగు వెలిగి కనుమరుగైపోయిన హీరోయిన్లు టాలీవుడ్‌ లో చాలా మంది ఉన్నారు. వారు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోనే కనిపించలేదు. అలా ఉన్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం...  రాంచరణ్‌ ఎంట్రీ మూవీతో అడుగుపెట్టిన నేహాశర్మ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేక కనుమరుగైపోయింది.

పవన్‌ కళ్యాణ్‌ బంగారం సినిమా ఎంట్రీ ఇచ్చిన మీరా చోప్రా ఇండస్ట్రీలో హిట్‌ కాలేక వెనుదిరిగింది. బన్నీ సినిమాలో హీరోయిన్‌ గౌరీముంజల్‌ దీ అదే కథ. రవితేజతో కలిసి 'నేనింతే' సినిమాతో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టిన సియా అయితే ఆ సినిమాతోనే క్లోజ్‌ అయిపోయింది. మళ్లీ సినిమాలు చేయలేదు. ఇక పంజా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సారా జేన్‌ - ఆర్య మూవీ హీరోయిన్‌ అనురాధా మెహతా - వరుడు మూవీ హీరోయిన్‌ భానుశ్రీ మెహ్రా - దిల్‌ సినిమాతో సక్సెస్‌ నందుకున్న నేహా కూడా మళ్లీ కనిపించలేదు. నాగచైతన్య మూవీ 'సాహసమే శ్వాసగా సాగిపో” హీరోయిన్‌ మంజిమా మోహన్‌ లు ఒక్క సినిమాతోనే కనుమరుగైపోయిన వాళ్లలో ఉన్నారు. ఇలా టాలీవుడ్‌ లోకి ఎన్నో ఆశలతో తెరంగేట్రం చేసిన హీరోయిన్లు చాలా మంది ఆ ఒక్క సినిమాతోనే కనుమరుగైపోయారు. మళ్లీ సినిమాల్లో చేసింది లేదు...తెరపై కనిపించింది లేదు. టాలీవుడ్‌ కలలు కల్లలైన హీరోయిన్ల కథ ఇదీ..



మరింత సమాచారం తెలుసుకోండి: